twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బెజవాడ' కథలో ఓ పాత్ర అంటున్నాడు

    By Srikanya
    |

    బెజవాడని ఓ పాత్రగా చేసుకుని తీస్తున్న సినిమా ఇది. నాగచైతన్యలోని హీరోయిజాన్ని పూర్తి స్థాయిలో చూపించే సినిమా. ఇందులో ఎన్నో హైలైట్స్ ఉన్నాయి. వాటిని తెరమీద చూస్తేనే థ్రిల్ అని తెలిపారు దర్సకుడు వివేక్ కృష్ణ.నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'బెజవాడ'. రామ్‌ గోపాల్‌ వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు నిర్మిస్తున్నారు. వివేక్‌కృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అమలాపాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తైన సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు దర్శకుడు. అలాగే ...దర్శకుడిగా నా తొలి చిత్రం ఇంత అద్భుతమైన కాంబినేషన్‌తో సెట్ కావడం నా అదృష్టం. రాముగారు 'బెజవాడ'ని ఎంతో ఇష్టపడి నిర్మిస్తున్నారు అన్నారు.

    కథ గురించి చెపుతూ..''దుర్మార్గులను అంతం చేయాడానికి ఒక్కోసారి దుర్మార్గుడిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. తను పుట్టి పెరిగిన 'బెజవాడ' జోలికొస్తే ఎంతటివారినైనా ఎదిరించేందుకు సిద్ధమైన యువకుడి కథ 'బెజవాడ'. ఆ యువకుడుగా నాగచైతన్య కనిపిస్తారు.అలాగే ఎవరైనా సరే పుడుతూనే కత్తి పట్టుకొని పగతో రగిలిపోరు. పరిస్థితులే వాళ్లలో కక్షల్నీ, కార్పణ్యాల్నీ పెంచుతాయి. మా కథలోని యువకుడు ఏ కారణాలతో రౌడీగా మారాల్సి వచ్చింది. అతని లక్ష్యం ఏమిటి అన్నది తెర మీదే చూడాలి నాగచైతన్య నటన తప్పకుండా మాస్‌ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు.

    ఇక నిర్మాత కిరణ్‌కుమార్ కోనేరు మాట్లాడుతూ ...రాముగారి నుంచి వస్తున్న ఓ డిఫరెంట్ కమర్షియల్ సినిమా ఇది. నాగచైతన్య అద్భుతంగా అభినయిస్తున్నాడు. 'బెజవాడ' షూటింగ్ ప్రారంభమైనప్పట్నించే అంఛనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వాటిని మించిన స్థాయిలో సినిమా ఉంటుంది. ఈ నెలాఖరున సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఐదుగురు ఫైట్ మాస్టర్లు ఈ చిత్రానికి పని చేయడం విశేషం. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం అని చెప్పారు.

    ప్రభు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అజయ్, అంజనా సుఖాని, శుభలేఖ సుధాకర్, అభిమన్యుసింగ్, ముకుల్‌దేవ్, సత్యప్రకాశ్, అశోక్‌కుమార్, శ్రావణ్, లక్ష్మి, రాహుల్ తదితరులు కీలక పాత్రధారులు.ఈ చిత్రానికి పాటలు: రెహమాన్, సిరాశ్రీ, కలువపాయి, సంగీతం: అమర్ మొహెలే, ప్రదీప్ కోనేరు, ప్రేమ, ధరమ్ సందీప్, విక్రమ్, బప్పీ టూటెల్, ఛాయాగ్రహణం: ఎస్.కె. భూపతి, కూర్పు: గౌతంరాజు, డాన్స్: ప్రేమ్‌రక్షిత్, శోభ, నిర్మాతలు: రాంగోపాల్‌వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వివేక్‌కృష్ణ.

    English summary
    Naga Chaitanya’s high voltage political action thriller Bejawada is completed Shooting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X