»   » అనుకోకుండా జరిగిందా..లేక...!? చైతూ ఏంటిదీ..

అనుకోకుండా జరిగిందా..లేక...!? చైతూ ఏంటిదీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగ చైతన్య కెరీర్ ఈమధ్య కాస్త ఎత్తుపల్లాలు గానే సగుతోంది. ఇప్పుడు చైతూ ఆశలన్నీ తన రాబోయే సినిమాలు "ప్రేమం" "సాహసం శ్వసగా సాగిపో" మీదనే పెట్టుకున్నాడు. అయితే ఈ ప్రయత్నం లో యాదృచ్చికంగానే జరిగిందో లేక ఆ హీరోయిన్లు తనకు అదృష్టాన్ని తెస్తారు అనుకున్నాడేమో కానీ. మళయాళ హీరో "నివిన్ పాల్" న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ప్రేమ‌మ్ రీమేక్‌లో న‌టిస్తున్న చైత‌న్య‌. తనుకూడా నివిన్ పాల్ నే ఫాలో ఔతున్నాడు.

అసలు విశయం, ఏమిటంటే మల్లు వూడ్ లో నివిన్‌కి రెండు నెల‌ల గ్యాప్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన చిత్రాలు "ఒరు వ‌డ‌క్క‌న్ సెల్ఫీ", "ప్రేమ‌మ్‌". పోయిన సంవత్సరం విడుదలైన ఈ రెండు సిన్మాలూ నివిన్ కి మంచి హిట్ లని ఇచ్చాయి. ఈ సినిమాలతో ఫాం లోకి వచ్చిన నివిన్ ఇప్పుడు మళ్ళూవుడ్ లో బిజీ స్టార్ అయ్యాడు

అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఏమిఒటంటే నివిన్ నటించిన "ఒరు వ‌డ‌క్క‌న్ సెల్ఫీ"లో మంజిమా మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఆ త‌రువాత వ‌చ్చిన ప్రేమ‌మ్‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డోనా సెబాస్టియ‌న్ న‌టించారు. ఈరెండు సినిమాలూ రెండు నెలల గ్యాప్ లోనే వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. రెండిటిలోనూ నివిన్ మంచి మార్కులే కొట్టాడు.

Naga Chaitanya Following Mollywood Hero Nivin

అయితే ఇప్పుడు నాగ‌చైత‌న్య కొత్త చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపోలో మంజిమా మోహ‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. ఆ త‌రువాత నెల రోజుల గ్యాప్‌లో రానున్న మ‌రో చిత్రం ప్రేమ‌మ్‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డోనా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇ

ది అనుకోకుండా జరిగిందో లేక నివిన్ కి అదృష్టాన్ని తెచ్చిన ఈ భామలు తనకూ కలిసి వస్తారు అనుకున్నాడేమో గానీ నాగ చైతన్య కూడా ఇదే కాంబో ని ఇక్కడ కూడా రిపీట్ చేసాడు. ఈ రెండు సినిమాలు కూడా రెండు నెలల గ్యాప్ లోనే విదుస్దలకు సిద్దంగా ఉన్నాయి. మ‌రి నివిన్‌కి క‌లిసొచ్చిన ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌లు చైతూకి కూడా క‌లిసొస్తారో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

మరి ఇప్పుడు ఉన్న పోటీలో నాగ చైతన్య నెగ్గుకు రావాలంటే అటు ఎన్టీఆర్ తోనూ ఇటు వికటరీ వెంకటేష్ తో నూ మాత్రమే కాక ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ "కబాలి" తోనూ తలపడాల్సి ఉంటుంది కానీ అక్కడ నివిన్ సినిమాలు వచ్చినప్పుడు మరీ ఇంత భారీ స్థాయి పోటీ మాత్రం లేదు. ఈ ప్రతి కూల పరిస్థితుల్లో చైతూ ఎలా విజయాన్ని అందుకుంటాడో ఏమో మరి... ఆల్ ద బెస్ట్ చైతన్యా..

English summary
Naga chaitanya following mallu hero Nivin as he acted with heroines in "oru vadakkan selfy" and "premam". chaitu repeating the same combination with those heroines with Nivin
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu