For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Naga Chaitanya: నాగ చైతన్య చిత్ర బృందంపై దాడి.. గుడిలో అలాంటి పనులు చేశారని ఆగ్రహం

  |

  టాలీవుడ్​ గుడ్​ బాయ్​గా పేరు తెచ్చుకున్నాడు అక్కినేని నాగ చైతన్య కామ్ గోయింగ్ పర్సన్. మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ సమంతతో విడాకులు తప్పుతే తన పని తాను చూసుకుంటూ పోయే హీరో. సినీ ఇండస్ట్రీలో సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీ వంటి విషయాలకు దూరంగా ఉంటాడు. సినిమాలు, ప్రమోషన్లు, కెరీర్​ చూసుకోవడం తప్ప ఎలాంటి వివాదాల జోలికి వెళ్లడు. ఇటీవల బాలీవుడ్ లో డెబ్యూగా చేసిన లాల్ సింగ్ చద్ధా, థ్యాంక్యూ మూవీస్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమాలపై ఆచితూచి అడుగువేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఓ మూవీ షూటింగ్ కు వెళ్లిన నాగ చైతన్య మూవీ టీమ్ పై అక్కడి స్థానికులు దాడి చేశారని టాక్ వినిపిస్తోంది.

   సినీ ఇండస్ట్రీకి ఎంటరై 13 ఏళ్లు..

  సినీ ఇండస్ట్రీకి ఎంటరై 13 ఏళ్లు..

  టాలీవుడ్​ మన్మథుడు నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీకి నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు కావొస్తుంది. నాగచైతన్య 2009లో జోష్ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అక్కినేని కుటుంబం నుంచి హీరో వస్తుండటంతో సినీ అభిమానుల్లో, అక్కినేని ఫ్యాన్స్‌ నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా విడుదలైన తర్వాత అంచనాలన్నీ తారుమారయ్యాయి.

   ఏ మాయ చేసావే సినిమాతో హిట్..

  ఏ మాయ చేసావే సినిమాతో హిట్..

  తర్వాత గౌతమ్​ వాసుదేవ్​ మీనన్​ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో మంచి హిట్​ కొట్టాడు నాగ చైతన్య. ఇందులో ముద్దు సీన్లు, నటనతో యూత్​ను ఎక్కువగా అట్రాక్ట్ చేశాడు. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్​ఫేర్​ అవార్డు కూడా అందుకున్నాడు.

  100% లవ్ అంటూ..

  100% లవ్ అంటూ..


  అనంతరం క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ దర్శకత్వంలో మిల్కీ​ బ్యూటీ తమన్నాతో నాగ చైతన్య జోడి కట్టిన చిత్రం 100% లవ్. ఈ సినిమా కూడా బ్లాక్​ బస్టర్ హిట్​ అయింది. దీంతో చైతూ లవర్ బాయ్​గా ముద్ర వేసుకున్నాడు. ఇక ఈ భారీ విజయాల తర్వాత వచ్చిన దడ, బెజవాడ, అటో నగర్​ సూర్య, తడఖా సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.

   తనదైన శైలిలో..

  తనదైన శైలిలో..

  ఇక ఇటీవల విడుదలైన నాగ చైతన్య థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్ధా సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో తన తర్వాతి సినిమాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది.

  మేలుకోతే గుడి ప్రాంతంలో..

  మేలుకోతే గుడి ప్రాంతంలో..


  నాగ చైతన్య-వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కర్ణాటకలోని మేలుకోతే గుడి ప్రాంతంలో జరుగుతోంది. అక్కడ ఉన్న ఈ చారిత్రక దేవాలయంలో పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ షూటింగ్ కోసమని మేలుకోతే ప్రసిద్ధ రాయగోపుర దేవాలయ పరిసర ప్రాంతంలో ఓ బార్ కు సంబంధించిన సెట్ వేశారు. దీంతో ఆగ్రహంతో అక్కడి స్థానికులు యూనిట్ పై దాడి చేశారని తెలుస్తోంది.

  బార్ సెట్ నిర్మాణంపై..

  బార్ సెట్ నిర్మాణంపై..

  పురావస్తు శాఖ స్మారక చిహ్నం సమీపంలో బార్ సెట్ నిర్మాణంపై మాండ్యాలోని పాండవపూర్ తాలుకా మేలుకోతే గ్రామానికి చెందిన ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారట. బార్ సెట్ నిర్మించి శ్రీ వైష్ణవ క్షేత్రాన్ని అవమానించారని నాగ చైతన్య సినిమా యూనిట్ పై మండిపడినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన మనోభావాలను దెబ్బ తీస్తూ చిత్రీకరణ చేసారని, తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్థానికులు ఆదేశించారట.

  చట్టపరమైన చర్యలు కూడా..

  చట్టపరమైన చర్యలు కూడా..


  అంతేకాకుండా అలా బార్ సెట్ వేసినందుకు చిత్ర యూనిట్ పై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ షూటింగ్ సమయంలో ఉంచిన కొన్ని మద్యం బాటిళ్లు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  English summary
  Tollywood Hero Naga Chaitanya And Venkat Prabhu Movie Team Done A Mistake In Karnataka Melukote Temple And Get Attacked By Karnataka People.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X