అలాంటి వార్తలు బాధించాయి.. నన్ను మీడియా టార్గెట్ చేయడం అంటూ.. పర్సనల్ లైఫ్ గురించి స్పందించిన నాగచైతన్య

దక్షిణాదిలో స్టార్ సెలబ్రిటీ కపుల్ నాగ చైతన్య, సమంత దాంపత్య జీవితంలో కలతలు చోటుచేసుకొన్నాయి. వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే విడాకుల అంశంపై మీడియాలో వస్తున్న వార్తలపై నాగ చైతన్య గానీ, మరెవరూ గానీ పెద్దగా స్పందించలేదు. అయితే ఈ వార్తలకు భిన్నంగా ఈ నెల 24వ తేదీన లవ్ స్టోరి సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమంలో బిజీగా గడుపుతూ.. మీడియాతో మాట్లాడుతున్నారు. తాజాగా తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించిన ఫీలింగ్స్ గురించి చెబుతూ..

పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ వేర్వేరు

పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ వేర్వేరు


తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. నా కెరీర్‌ తొలినాళ్లలో పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను కలిపి ముందుకు వెళ్లే వాడిని. ఇప్పుడు కేవలం ఎక్కువ శ్రద్ద పెడుతున్నాను. అయితే నేను ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను కలిపి ముందుకెళ్లను. రెండింటిని వేర్వేరుగా చూస్తాను. ఇక ముందు కూడా ఈ రెండింటిని కలిపి జీవితాన్ని కొనసాగించను అని నాగచైతన్య అన్నారు.

నాపై ఫ్యామిలీ ప్రభావమే ఎక్కువ

నాపై ఫ్యామిలీ ప్రభావమే ఎక్కువ

నా కెరీర్‌పై నా కుటుంబ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నా తాత, తండ్రి నుంచి ఎక్కువగా నేర్చుకొంటాను. సినిమా పరిశ్రమలో ఎలా ఉండాలనే విషయాన్ని నా పేరెంట్స్ నుంచి ఎక్కువగా నేర్చుకొన్నాను. ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను వాళ్లు ఎలా బ్యాలెన్స్ చేస్తానరనే విషయాన్ని వారి నుంచి గ్రహించాను. ఇంటిలో ఎప్పుడూ వారి ప్రొఫెషనల్ లైఫ్ గురించి డిస్కస్ చేయరు. వారి నుంచి నేర్చుకొన్న విషయాలను నేను నా జీవితానికి అన్వయించుకొంటున్నాను అని నాగచైతన్య చెప్పారు.

సోషల్ మీడియాను పట్టించుకోను

సోషల్ మీడియాను పట్టించుకోను

నా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో వచ్చే విషయాలను పెద్దగా పట్టించుకోను. సోషల్ మీడియా ప్రభావం నాపై ఉండదు. లాక్‌డౌన్ తర్వాత నా జీవితంలో, నా ఆలోచనల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. నా జీవితం గురించి మీడియా అతిగా చర్చించడం, కవరేజ్ చేయడం చాలా బాధాకరం. తొలుత అలాంటి విషయాలు బాధించాయి. కానీ ఆ తర్వాత అలాంటి వాటిని పట్టించుకోవడం మానేశాను అని నాగచైతన్య తెలిపారు.

వార్తల్లో వేగం పెరిగింది అంటూ

వార్తల్లో వేగం పెరిగింది అంటూ


మీడియా కవరేజ్ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు వార్తల వేగం పెరిగింది. ఒక వార్తను మరో వార్త రిప్లేస్ చేస్తుంది. ఇకప్పుడు వార్తలకు ఎక్కువగా మ్యాగజైన్ మాత్రమే ఉండేది. నెలకు ఒకసారి మాత్రమే మ్యాగజైన్స్ వచ్చేవి. కాని ఇప్పుడు రోజుకు ఒక వార్త మరో వార్తను రిప్లేస్ చేస్తున్నది. దాంతో వార్తలు పెద్దగా ప్రజల మనసులో ఉండటం లేదు. కొద్ది రోజులకే మీడియా వార్తలను మరిచిపోతున్నారు. ఇప్పుడంతా టీఆర్పీ బేస్ వార్తలే కనిపిస్తున్నాయి. అలాంటి వార్తలు నాకు ఎలాంటి ఇబ్బంది కలిగించడం లేదు అని నాగచైతన్య తెలిపారు.

లాల్ సింగ్ చద్దా ఆఫర్ గురించి

లాల్ సింగ్ చద్దా ఆఫర్ గురించి


లాల్ సింగ్ చద్దా సినిమాలో అమీర్ ఖాన్‌తో కలిసి నటించడం ఓ మ్యాజిక్ లాంటింది. జీవితంలో ఎప్పుడో ఒకసారి అలాంటి మ్యాజిక్ జరుగుతుంది. నాకు ఒకరోజు ఫోన్ వచ్చింది. అమీర్ ఖాన్ మీతో మాట్లాడుతారని చెప్పారు. దాంతో లాల్ సింగ్ చద్దా సినిమాలో ఓ పాత్ర గురించి ఆఫర్ ఇచ్చారు. ముంబైకి ఓసారి రావాలని కోరారు. దాంతో ముంబైకి వెళ్లి నేను కొన్ని డైలాగ్స్ చెప్పాను. దాంతో మీరు ఈ సినిమాలో నటిస్తున్నారని వెంటనే చెప్పారు. అలా లాల్ సింగ్ చద్దా సినిమాలో భాగమయ్యాను. ఆయనతో చేసిన 40 రోజుల ట్రావెల్ జీవితంలో మరిచిపోలేనిది అని నాగచైతన్య అన్నారు.

Recommended Video

Director Sekhar Kammula Exclusive Interview About 'Love Story' | Part 3
ప్యాన్ ఇండియా మూవీస్‌పై

ప్యాన్ ఇండియా మూవీస్‌పై

ఇక నాకు ప్యాన్ ఇండియా సినిమాలపై అంత ఆసక్తి లేదు. ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకులకు చేరువ కావాలని అనుకొంటున్నాను. తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నాను. ప్యాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తే కుదరదు. అవి అలా జరిగిపోతుంటాయి అని నాగచైతన్య చెప్పారు. ప్రస్తుతం థ్యాంక్యూ సినిమా పది రోజుల షూటింగ్ ఉంది. అలాగే బంగార్రాజు సినిమా చేస్తున్నాను. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం విక్రమ్ కుమార్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X