»   » నాగచైతన్య కొత్త చిత్రం 'దడ' సినిమా స్టోరీ లైన్

నాగచైతన్య కొత్త చిత్రం 'దడ' సినిమా స్టోరీ లైన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య,కాజల్ కాంబినేషన్ లో అజయ్ భుయాన్ దర్శకత్వంలో 'దడ' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథ ఎలా నడుస్తుందంటే...కాలేజ్ అంటే పుస్తకాలు , మార్కులు మాత్రమే కాధు అని నమ్మే కుర్రాడు హీరో . వంద మార్కులు తెచ్చుకొని ఉత్తమ విధ్యర్థి గా పేరు తెచ్చుకోవడం కంటే, అత్తెసారు మార్కులతో మనసుకు నచ్చిన విధంగా జీవించడమే ఆతనికి ఇష్టం.

పుస్తకాల పురుగు అనిపించుకోవడం కంటే , వ్యవస్ధలోని పురుగులని ఏరి వేయడమే అతనికి ఇష్టం,.అలాగని ఆకతాయి కాదు.చదువు పేరు తో వెర్రి వేషాలు వేసే వారందరికి దడ పుట్టించే సత్తా ఉన్నవాడు.ఆ కుర్రాడి లక్ష్యం ఏంటి? ఆది ఎలా సాధిస్తాడు అనేదే దడ. నాగచ్చైతన్య కాజల్ నటిస్తున్నఈ చిత్రం షూటింగ్ యూరప్ లో జరుగుతున్నధి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆంధిస్తున్నాడు.పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య అన్నగా తమిళ హీరో శ్రీరామ్ కనిపించనున్నాడు.

ఇక బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందే ఈ చిత్రానికి కెమెరాని జ్ఞాన శేఖర్(వేదం ఫేమ్) అందించనున్నారు. బొమ్మరిల్లు చిత్రానికి మాటలు రాసిన అబ్బూరి రవి ఈ చిత్రానికి డైలాగులు అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం కథ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని, ఊహించని ట్విస్ట్ లు, గోవాలో కేసినోలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ అంటున్నారు. ఇక అజయ్ భుయాన్ రూపొందించిన హౌస్ ఫుల్ చిత్రం ఎవరూ కొనక ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. అలాగే ఈ చిత్రాన్ని శివప్రసాద్ రెడ్డి తమ కామాక్షి మూవీస్ ఎంటర్టైనర్ పతాకంపై రూపొందిస్తున్నారు.

English summary
After 100% Love, Naga Chaitanya is about to act in Dada film produced by Chandan Reddy, son of D Sivaprasad Reddy on the banner of Kamakshi Enterprises Pvt. Ltd. Directed by Ajay Bhuyan, starring Naga Chaitanya and Kajal Agarwal in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu