twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జునకి అమల..నాగచైతన్యకు ఆమె!?

    By Srikanya
    |

    నాగార్డున శివ చిత్రం టైమ్ లో తనతో హీరోయిన్ గా చేసిన అమలతో ప్రేమలో పడి పెళ్ళాడారు.రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది.అదే రోజులను గుర్తు చేస్తూ...నాగచైతన్య హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న చిత్రం బెజవాడు. అందులో హీరోయిన్ అమలా పౌల్.వీళ్ళద్దరి కెమిస్ట్రీ చూస్తుంటే అప్పట్లో నాగార్జున,అమల రోజులు గుర్తుకు వస్తున్నాయంటున్నారు.రామ్ గోపాల్ వర్మ ప్రాజెక్టు కావటం,అమల అనే పేరు రిపీట్ కావటం, నాగార్జున కొడుకు హీరో కావటం తో చరిత్ర తిరిగి రిపీట్ అవుతుందా అనే సందేహం సీనియర్స్ వ్యక్తీ కరిస్తున్నారు. ఇక అమలా పౌల్ మొదట నాన్న చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరైంది. ఇక ''దుర్మార్గులను అంతం చేయాడానికి ఒక్కోసారి దుర్మార్గుడిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. తను పుట్టి పెరిగిన 'బెజవాడ' జోలికొస్తే ఎంతటివారినైనా ఎదిరించేందుకు సిద్ధమైన యువకుడి కథ 'బెజవాడ'. ఆ యువకుడుగా నాగచైతన్య కనిపిస్తారు.అలాగే ఎవరైనా సరే పుడుతూనే కత్తి పట్టుకొని పగతో రగిలిపోరు. పరిస్థితులే వాళ్లలో కక్షల్నీ, కార్పణ్యాల్నీ పెంచుతాయి. మా కథలోని యువకుడు ఏ కారణాలతో రౌడీగా మారాల్సి వచ్చింది. అతని లక్ష్యం ఏమిటి అన్నది తెర మీదే చూడాలి నాగచైతన్య నటన తప్పకుండా మాస్‌ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు దర్శకుడు వివేక్‌కృష్ణ. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బెజవాడ'.

    నాగచైతన్య, అమలాపాల్‌ జంటగా నటిస్తున్నారు. రామ్‌గోపాల్‌ వర్మ, కిరణ్‌కుమార్‌ కోనేరు నిర్మాతలు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఛేజింగ్‌ దృశ్యాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 12 నుంచి స్విట్జర్లాండ్‌లో పాటలు చిత్రిస్తారు. దీపావళికి సినిమా విడుదలవుతుంది.బెజవాడ నాదిరా... ముట్టుకుంటే పగిలిపోద్ది.. బెజవాడ సినిమాలో నాగచైతన్య చెప్పే డైలాగ్ ఇది.దీన్నే ప్రోమోలలో రిలీజ్ చేసారు.నాగచైతన్య 'బెజవాడ"గురించి మాట్లాడుతూ -''రామ్‌గోపాల్‌వర్మ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ఎంతో ఎక్సైట్ అయ్యాను. ఇందులో నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు వివేక్ అద్భుతంగా సినిమాను తీస్తున్నారు. నా కెరీర్‌కి ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది" అన్నారు.ఈ చిత్రం చుట్టూ ఇప్పటికే చాలా కాంట్రావర్శీ పేరుకుంది.వర్మ ఈ చిత్రం టైటిల్ వివాదంతో సినిమా ప్రారంభించి క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం: అమర్ మొహ్లే, బప్పీటూటిల్, విశాల్, విక్రమ్, నేగి, ప్రదీప్ కోనేరు, ధరమ్ సందీప్, కెమెరా: ఎస్.కె.ఎ.భూపతి, ఆర్ట్: కృష్ణమాయ, సమర్పణ: వందిత కోనేరు. ప్రభు, కోట శ్రీనివాసరావు, అంజన, బ్రహ్మానందం, అజయ్‌, సత్యప్రకాష్‌, శుభలేఖ సుధాకర్‌ తదితరులు నటిస్తున్నారు.

    English summary
    Director Vivek Krishna said that Bezawada released on Deepavali.
 
 We all know that Nagarjuna, Amala love story started on Shiva sets. Later they went on to act in few more films and eventually got married. Did Bejawada movie ignite another Nag-Amala love story? 
 
 Although there are no rumors heard about Naga Chaitanya, Amala Paul chemistry on the sets, people couldn't stop themselves from recalling Nag, Amala's love affair from the Shiva days. The reason for it is these two are having the same names and also Ram Gopal Varma is involved in this movie too. Interestingly, Naga Chaitanya's character name in this film is Shiva!
 
 With so many similarities is the history going to repeat again? Are we going to see another Nag and Amala love affair again? Only time has to tell.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X