»   »  చైతూ ‘ప్రేమమ్‌’ అఫీషియల్ ట్రైలర్ ఇదిగో (వీడియో), అఖిల్ ఇలా అనేసాడేంటి

చైతూ ‘ప్రేమమ్‌’ అఫీషియల్ ట్రైలర్ ఇదిగో (వీడియో), అఖిల్ ఇలా అనేసాడేంటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం 'ప్రేమమ్‌'. చందు మొండేటి దర్శకుడు. శ్రుతిహాసన్‌, మడోనా సెబాస్టియన్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్స్. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. గోపీసుందర్‌, రాజేష్‌ మురుగేశన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలని నిన్న రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్బంగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఎలా ఉందో కామెంట్స్ ని మీరు ఈ క్రింద కామెంట్స్ కాలంలో రాయండి.

Naga Chaitanya's Premam Telugu Official Trailer Is Out

అఖిల్‌ చెబుతూ ''ట్రైలర్‌ చూస్తుంటే.. ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమికుడు మా అన్నయ్యే అనాలనిపిస్తుంది. ప్రేమకథల్లో తనతో పోటీ పడలేను. తనని ఫాలో అయిపోతానంతే. చందూ తొలి సినిమా 'కార్తికేయ' చూసినప్పుడు కాస్త భయం వేసింది. ఇప్పుడు ఈ సినిమాని చాలా బాగా తీశాడు''అన్నారు.


''ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. నాపై నమ్మకంతో ఈ పాత్ర ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సంగీతం చాలా బాగుంది. చైతూ నాకు మంచి స్నేహితుడు'' అంది శ్రుతిహాసన్‌.


నాగచైతన్య మాట్లాడుతూ ''చందూని రీమేక్‌ చేయమని అడగడం తప్పు. ఎందుకంటే తనలో క్రియేటివిటీ లెవల్స్‌ వేరేలా ఉన్నాయి. తన సొంత కథతో ఓ మరో మంచి సినిమా తీయాలనుంది. చాలా నమ్మకంగా చెబుతున్నా. మనమంతా గర్వంగా చెప్పుకొనే సినిమా ఇది'' అన్నారు.


చందూ మొండేటి మాట్లాడుతూ- ''ఈ చిత్రానికి 'లవ్‌స్టోరీస్ ఎండ్... ఫీలింగ్స్ డోన్ట్...' అనేది ఉపశీర్షిక. నాగచైతన్య పాత్ర ఇందులో మూడు వైవిధ్యమైన పార్శ్వాలతో సాగుతూ ఆసక్తి కలిగిస్తుంది. శ్రుతీహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ లు ఈ చిత్రంలో కథానాయికలుగా బాగా సూట్ అయ్యారు. ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గోపీసుందర్, రాజేశ్ మురుగేశన్, సమర్పణ: పీడీవీ ప్రసాద్.

English summary
Akkineni Family hero Naga Chaitanya’s Premam movie first official trailer is released. It is the remake of super hit Malayalam film Premam. Shruti Haasan and Anupama Parameswaran are playing lead female roles in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu