»   » నాగ చైతన్య న్యూ మూవీ షురూ, రాజమౌళి ఫ్యామిలీకి ఏమిటి సంబంధం? (ఫోటోస్)

నాగ చైతన్య న్యూ మూవీ షురూ, రాజమౌళి ఫ్యామిలీకి ఏమిటి సంబంధం? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని స్టార్ నాగ చైతన్య హీరోగా కృష్ణ ఆర్.వి మరిముత్తు దర్శకత్వంలో న్యూ మూవీ మంగళవారం వారాహి చలన చిత్రం కార్యాలయంలో లాంచనంగా ప్రారంభం అయింది. వారాహి చలన చిత్రం, సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, డి సురేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ముహూర్తపు సన్నివేశానికి గుణ్ణం గంగరాజు క్లాప్ కొట్టగా... కీరవాణి కెమెరా స్విచాన్ చేసారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి పెళ్లి చూపులు ఫేం వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎక్కువగా రాజమౌళి ఫ్యామిలీకి చెందిన వారే కనిపించడానికి కారణం రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు.

 ప్రారంభోత్సవం

ప్రారంభోత్సవం

ముహూర్తపు సన్నివేశానికి రచయిత, దర్శకుడు గణ్ణం గంగరాజు క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. సురేష్ బాబు, దేవినేని ప్రసాద్ చేతుల మీదుగా దర్శకుడు కృష్ణ ఆర్.వి మరిముత్తు స్క్రిప్టు అందుకున్నారు.

 నటీనటులు

నటీనటులు

ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

రాజమౌళి తనయుడు

రాజమౌళి తనయుడు

దర్శకుడు రాజమౌళి తన కుమారుడు కార్తికేయను సినీ నిర్మాణ రంగంలోకి దింపారు. ఈ చిత్రానికి కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. కొంత అనుభవం వచ్చిన తర్వాత కార్తికేయ స్వయంగా సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

 అతిథులు

అతిథులు

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథులుగా సురేష్ బాబు, రాజమౌళి, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, గుణ్ణం గంగరాజు, దేవినేని ప్రసాద్, అవసరాల శ్రీనివాస్ హాజరయ్యారు.

 తెర వెనక

తెర వెనక

లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, స్టోరీ : డేవిడ్ ఆర్ నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్ నాథన్, అబ్బూరి రవి, ఆర్ట్: రామకృష్ణ, కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి మరిముత్తు.

English summary
Handsome hero Akkineni Naga Chaitanya’s new movie produced combinely by Sai Korrapati of Vaaraahi Chalana Chitram and D Suresh Babu of Suresh Production is opened today with Muhurtham Pooja held at Vaaraahi Chalana Chitram office attended by important guests like Suresh Babu, SS Rajamouli, Keeravani, Vijayendra Prasad, Srikanth, Gunnam Gangaraju, Devineni Prasad, Avasarala Srinivas and others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu