»   » అక్కినేని వారి రెండో నిశ్చితార్థం తేదీ ఇదే ...: ఇప్పుడు సమంతా నాగచైతన్య ల వంతు

అక్కినేని వారి రెండో నిశ్చితార్థం తేదీ ఇదే ...: ఇప్పుడు సమంతా నాగచైతన్య ల వంతు

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అందరికీ తెలిసిన అపీషియల్ మ్యాటరే. సమంత, నాగ చైతన్య మధ్య చాలా ఏళ్ల నుండి ప్రేమాయణం నడుస్తోంది. అయితే సమంత స్వయంగా విషయం బయట పెట్టే వరకు ఎవరూ పసిగట్టేలేక పోయారు.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.... తాను గతంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో నాగ చైతన్య గురించి క్లూ ఇచ్చానని, అయినా మీడియా వారు పసిగట్టలేకపోయారని సమంత చెప్పింది. క్లూ ఇవ్వటం సమంత పద్దతి అని తెలియగానే తన చేతి ఉంగరం ఫొటోని పోస్ట్ చేయటం తో ఈ ఇద్దరికీ రహస్యంగా ఎంగేజ్మెంట్ జరిగినట్లు ప్రచారం జరిగింది.

Naga Chaitanya & Samantha Engagement Date

అసలు ఇలాంటి ప్రచారం మొదలు కావడానికి కారణం సమంత. సమంత తన సోషల్ మీడియా పేజీలో ఎంగేజ్మెంట్ రింగ్ ఉన్న ఫోటోను పోస్టు చేసింది. ఆ ఫోటోస్ చూసిన వారంతా ఇద్దరికీ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిపోయినట్లు చర్చించుకున్నారు. కా ఆ విషయం ఎవరూ ధృవీకరించలేదు.

కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. అఖిల్ నిశ్చితార్ధం వేడుకలో కలిసి సందడి చేశారు కానీ.. కనీసం వీళ్ళ నిశ్చితార్ధం మాట కూడా చెప్పలేదు. ఇప్పుడా విషయం తెలిసిపోయింది. 2017 జనవరి 29న చైతు-శామ్స్ ల ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరపనున్నారట. ఇప్పటికే చైతు నిశ్చితార్ధానికి సంబంధించిన పనులు కూడా మొదలైపోగా.. నాగ్ ఈ పనుల్లోనే బిజీగా ఉన్నారట.

Naga Chaitanya & Samantha Engagement Date

అఖిల్ నిశ్చితార్ధం-వివాహం మధ్య ఆరు నెలలు గ్యాప్ ఉండడానికి కారణం కూడా.. మధ్యలో చైతు-సమంతల ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేయడానికే అంటున్నారు. జనవరి నెలాఖరులో వీరి నిశ్చితార్ధం పనులు పూర్తి చేశాక.. అఖిల్ పెళ్లి పనులు మొదలుపెడతాడట నాగ్. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అఖిల్-శ్రేయా.. చైతు-సమంత.. రెండు జంటల పెళ్లిళ్లు డెస్టినేషన్ వెడ్డింగ్స్ గానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

English summary
Young hero Naga Chaitanya and dazzling beauty Samantha who are in love relation since a long time are finally going to get engaged. This could be the happiest news for all the fans and adorers of Chaitu and Sam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu