»   » ట్విట్టర్ టాక్ :నాగ చైతన్య, సమంత సరదా పంచ్ లు

ట్విట్టర్ టాక్ :నాగ చైతన్య, సమంత సరదా పంచ్ లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగచైతన్య కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ‘ఏమాయ చేసావే'. ఈ చిత్రం ద్వారా సమంత హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగు సినిమాలు దాకా వచ్చాయి. తాజాగా వీరి కాంబినేషన్ సెట్ చేసిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం టీజర్ నిన్న విడుదలైంది. ఈ నేపధ్యంలో సమంత, నాగచైతన్య మద్య సరదాగా ట్విట్టర్ లో టాక్ జరిగింది. అక్కడేం జరిగిందో ఇక్కడ చూడండి.

నాగచైతన్య హీరోగా తమిళ క్రేజీ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. యాక్షన్, లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా తమిళ వెర్షన్‌లో శింబు హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో ఈ సినిమాకు టైటిల్‌ని ఇప్పటికే నిర్ణయించారు. తెలుగులో సరైన టైటిల్‌కోసం దర్శకుడు అన్వేషణసాగింి ఈ చిత్రానికి ‘సాహసం శ్వాసగా సాగిపో' అనే టైటిల్‌ను పెట్టి టీజర్ విడుదల చేసారు.

మహేష్‌బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ ‘ఒక్కడు' చిత్రంలోని పాటకు పల్లవిని ఈ సినిమాకు పెడుతుండడం విశేషం. ఇప్పటికే తెలుగులో పలు చిత్రాలకు పాటల పల్లవిని తీసుకుని టైటిల్స్ పెడుతున్న విషయం తెలిసిందే. ఈనెల 29న నాగార్జున పుట్టిరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసారు. రీసెంట్ గా చైతూ చేసిన దోచేయ్ చిత్రం ఫ్లాఫ్ కావటంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Naga Chaitanya-Samantha's twitter talk!

మలయాళ భామ మంజిమ మోహన్ ఈ సినిమాలో నాగ చైతన్య సరసన చేస్తోంది. ప్రస్తుతం బెంగుళూరులో షూటింగ్ జరుగుతోంది. అక్కడ నాగ చైతన్య, మంజిమ మోహన్, మిగిలిన ప్రముఖ నటీనటులపైన కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ప్రధానంగా నాగ చైతన్య, మంజిమ మోహన్ పై వచ్చే కొన్ని కీలకమైన లవ్ సీన్స్ ని బెంగుళూరు లో షూట్ చేసారు.

ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ వెర్షన్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. తమిళ వెర్షన్ లో కూడా మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో ‘అచ్చం ఎన్బదు మదమైయద' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఎ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగులో ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

English summary
On the day Naga Chaitanya's 'Saahasam Swasaga Sagipo' teaser was unveiled, Samantha tweeted to Akkineni Scion saying: "All the best chay_akkineni. Teaser looks like you're gonna make more women swoon like you did in 2010". In response, Naga Chaitanya wrote: "haha thanks Sam ! As long as I can swoon u." And the reply from Sam to this comment: "you don't even have to try".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu