For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Thank You Twitter Review: చైతన్య మూవీకి షాకింగ్ టాక్.. అదే తేడా కొట్టిందట.. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే!

  |

  అక్కినేని ఫ్యామిలీ నుంచి చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును, స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను దక్కించుకున్న అతడు.. మధ్యలో చాలా కాలం పాటు వరుసగా పరాజయాలను చవి చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే 'మజిలీ' మూవీతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడని నాగ చైతన్య.. ఆ తర్వాత 'వెంకీ మామ', 'లవ్ స్టోరి', 'బంగార్రాజు' వంటి వరుస హిట్లతో సూపర్ డూపర్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'థ్యాంక్యూ' అనే సినిమాలో నటించాడు. ఎన్నో అంచనాలతో తాజాగా విడుదలైన ఈ మూవీకి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో చూద్దాం పదండి!

  థ్యాంక్యూ చెప్పేందుకు వచ్చేశాడు

  థ్యాంక్యూ చెప్పేందుకు వచ్చేశాడు

  అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రమే 'థ్యాంక్యూ'. విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీకి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్‌ రవి కథ, మాటలు అందించాడు. ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చాడు.

  Dhee షోలో షాకింగ్ సీన్: శ్రద్దా దాస్‌, ప్రదీప్‌తో కిరణ్ గొడవ.. ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన హీరోయిన్

  అలాంటి కథ... భారీ అంచనాలతో

  అలాంటి కథ... భారీ అంచనాలతో

  'థ్యాంక్యూ' మూవీ మన జీవితంలో ఎదుగుదలకు భాగమైన వ్యక్తులకు థ్యాంక్యూ చెప్పాలి అన్న నేపథ్యంతో తెరకెక్కింది. విక్రమ్ కే కుమార్ తన గత చిత్రాల మాదిరిగానే దీన్ని క్లాసిక్ టచ్‌తో రూపొందించాడు. ఇక, ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్లకు భారీ రెస్పాన్స్ రావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ సినిమా కోసం అందరూ వేచి చూస్తున్నారు.

  బిజినెస్ తగ్గట్లుగానే గ్రాండ్ రిలీజ్

  బిజినెస్ తగ్గట్లుగానే గ్రాండ్ రిలీజ్


  నాగ చైతన్య 'థ్యాంక్యూ' మూవీ నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లతో కలిపి రూ. 24.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది.

  క్లోజప్ ఫొటోల్లో తెలుగు హీరోయిన్ అందాల విందు: స్లీవ్‌లెస్ టాప్‌లో యమ హాట్‌గా!

  నాగ చైతన్య మూవీకి షాకింగ్ టాక్

  నాగ చైతన్య మూవీకి షాకింగ్ టాక్

  నాగ చైతన్య - రాశీ ఖన్నా జంటగా నటించిన 'థ్యాంక్యూ' మూవీ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు ఊహించని విధంగా మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. ఈ చిత్రం బాగుందని కొందరు, అంతగా లేదని ఇంకొందరు చెబుతున్నారు.

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

  'థ్యాంక్యూ' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి విక్రమ్ కే కుమార్ చాలా సమయం తీసుకున్నాడట. పాత్రలను పరిచయం చేయడం.. లవ్ ట్రాక్ చూపించడానికే ఎక్కువ సమయం పట్టిందట. అయితే, సెకెండాఫ్ మాత్రం హీరో పాత్ర చుట్టూనే ఫోకస్ చేశాడట. మొత్తంగా ఇందులో కమర్షియల్ అంశాలు మిస్ అయ్యాయని తెలిసింది.

  శృతి మించిన అనన్య అందాల ఆరబోత: వామ్మో ఆమె వేసుకున్న డ్రెస్ చూస్తే!

  సినిమా ప్లస్‌... మైనస్‌లు ఎంటి?

  సినిమా ప్లస్‌... మైనస్‌లు ఎంటి?

  'థ్యాంక్యూ' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో నాగ చైతన్య వన్ మ్యాన్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడట. సినిమా మొత్తానికి అతడే ప్లస్ అనేలా నటించాడట. అలాగే, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, నిడివి, మెసేజ్ ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అయితే, కామెడీ పేలకపోవడం, కథ, కథనం, ఎమోషన్ పండకపోవడం దీనికి మైనస్‌గా మారాయట.

  మొత్తంగా మూవీ ఎలా ఉందంటే

  మొత్తంగా మూవీ ఎలా ఉందంటే

  ట్విట్టర్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటించిన 'థ్యాంక్యూ' మూవీ ఎమోషన్స్‌తో సాగే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. అయితే, ఇందులో చైతూ మార్కు సన్నివేశాలు చాలా తక్కువగా ఉండడంతో ఫ్యాన్స్ నిరాశకు లోనవుతారట. కానీ, మిగిలిన వాళ్లకు మాత్రం ఈ చిత్రం నచ్చుతుందని అంటున్నారు.

  లవర్‌తో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: నైట్ టైమ్ అతడితో యమ హాట్‌గా!

  అదే తేడా కొట్టిందంటూ ట్వీట్లు

  అదే తేడా కొట్టిందంటూ ట్వీట్లు

  ఇప్పటి వరకూ వచ్చిన ట్వీట్లను బట్టి చూస్తే.. 'థ్యాంక్యూ' మూవీలో ఫ్రెష్‌నెస్ మిస్ అయిందని తెలుస్తోంది. వాస్తవంగా విక్రమ్ సినిమాలు కొత్తదనంతో నిండి ఉంటాయి. కానీ, ఈ సినిమా మాత్రం పాత సినిమాలను గుర్తు చేసే సన్నివేశాలతో సాగుతుందట. దీంతో కొత్త సినిమాను చూసిన ఫీల్ మిస్ అయినట్లు ఉంటుందట. ఇదే ఈ చిత్రానికి పెద్ద మైనస్‌గా మారిందని సమాచారం.

  English summary
  Akkineni Naga Chaitanya DId Thank You Movie under Vikram K. Kumar Direction. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X