నాగ చైతన్యను స్కూల్ నుంచి వెళ్లగొట్టారట... ఎందుకో తెలిస్తే నవ్వుకొంటారు!

By Rajababu

తెలుగువారి అభిమాన నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అందులో నటించిన నటీనటులకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ఈ సినిమాలో సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుగా ప్రత్యేక పాత్ర పోషించిన నాగచైతన్య కూడా ఆకట్టుకొన్నాడు. మహానటిలో తాత పాత్రలో కనిపించడానికి గల కారణాలను ఆయన ఇటీవల మీడియాతో పంచుకొన్నారు.

Recommended Video

నాన్నని సాకుగా చూపించి నో చెప్పాలనుకున్నా, క్లాస్ నుంచి గెంటేశారు.. నాగచైతన్య!
తాతయ్య పాత్ర అంటే భయమేసింది

తాతయ్య పాత్ర అంటే భయమేసింది

తాతయ్య పాత్ర అనే సరికి కొంత భయం వేసింది. నాగ అశ్విన్ తన పాత్ర గురించి చెప్పినప్పుడు చేయను అని చెప్పాలనిపించింది. కానీ నాగ అశ్విన్ కొంత కన్విన్స్ చేయడంతో కొంత సమయం తీసుకొంటాను అని చెప్పాను. ఆ తర్వాత నాన్నకు కాల్ చేసి మహానటిలో పాత్ర గురించి చెప్పాను అని నాగ చైతన్య చెప్పారు.

 నాన్నకు ఫోన్ చేశా

నాన్నకు ఫోన్ చేశా

నాన్న కూడా చేయకూడదని చెప్తారు. అదే విషయాన్ని నాగ అశ్విన్‌కు చెప్పి తప్పించుకొందామనుకొన్నాను. కానీ నాన్న కూడా తాత పాత్రను చేయమని ప్రోత్సహించే సరికి నో చెప్పలేకపోయాను. అయితే మహానటిలో తాత పాత్రలో నటించినందుకు మంచి పేరు వచ్చింది. చాలా మంది ఫోన్ చేయడం ద్వారా, వ్యక్తిగతం కలిసి అభినందనలు తెలిపారు అని నాగ అశ్విన్ వెల్లడించారు.

 దేవదాస్ సినిమా చూడనందుకు

దేవదాస్ సినిమా చూడనందుకు

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాత నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధం, కొన్ని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకొన్నారు. స్కూల్‌లో జరిగిన ఓ తమాషా సంఘటనను చెబుతూ.. మా తాతయ్య నటించిన దేవదాస్ చిత్రాన్ని చూశావా అని టీచర్ అడిగారు. అయితే నేను చూడలేదని చెప్పడంతో క్లాస్ నుంచి టీచర్ వెళ్లగొట్టారు అని తెలిపారు.

జీర్ణించుకోలేకపోయేవాడిని

జీర్ణించుకోలేకపోయేవాడిని

తాత కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే సినిమాను ఇంటికి వచ్చి వెంటనే చూశాను. ఆ తర్వాతే స్కూల్ వెళ్లాను అని సరదా సంఘటనను నాగచైతన్య వివరించారు. మహానటిలో తాత మాదిరిగా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని నాగచైతన్య అన్నారు. మహానటిలో తాత పాత్రను మరొకరు చేసి ఉండే నేను జీర్ణించుకోలేకపోయేవాడిని అని చైతూ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X