»   » నాగచైతన్య, కాజల్ కాంబినేషన్ లో ...

నాగచైతన్య, కాజల్ కాంబినేషన్ లో ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, కాజల్ కాంబినేషన్ లో ఓ చిత్రం మార్చిలో ప్రారంభం కానుంది. ఈ మేరకు కామాక్షి కళా మూవీస్ అధినేత శివప్రసాద్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు.ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...'కామాక్షి సంస్థ సిల్వర్ జూబ్లీ ఇయర్‌లో నాగచైతన్య హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం ద్వారా అజయ్ భూయాన్‌ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. విఎస్ జ్ఞానశేఖర్ ఛాయాగహ్రణాన్ని నిర్వహిస్తారు. భారీ తారాగణంతో హై టెక్నికల్ వాల్యూస్‌ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం. అద్భుతమైన సబ్జెక్ట్ రెడీ అయింది' అని తెలిపారాయన. ఇక నాగచైతన్య, గౌతం మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఏం మాయ చేసావే చిత్రం ఈ శుక్రవారం రిలీజు అవబోతోంది.అలాగే అజయ్ భూయాన్‌ గతంలో హౌస్ ఫుల్ అనే చిత్రాన్ని డైరక్ట్ చేసారు. ఆ చిత్రం రిలీజు కాలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu