»   » యుద్దం శరణం రిలీజ్ వాయిదా...అర్జున్ రెడ్డి మస్త్‌హ్యాపీ

యుద్దం శరణం రిలీజ్ వాయిదా...అర్జున్ రెడ్డి మస్త్‌హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

కారణాలు ఇవీ అని ఖచ్చితంగా చెప్పలేం గానీ... ఆగస్టు 24కు అనుకున్న అక్కినేని నాగచైతన్య సినిమా 'యుద్ధం శరణం' ఆ తేదీ నుంచి వాయిదా పడిపోయింది. ఈ చిత్రాన్ని రెండు వారాలు ఆలస్యంగా సెప్టెంబరు 8న రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఆగస్టు చివరి వారంలో 'అర్జున్ రెడ్డి' తప్ప వేరే సినిమా ఏదీ లేదు. ఆ సినిమాకు క్రేజ్ ఉన్నప్పటికీ దాన్ని మరీ పెద్ద పోటీగా ఏమీ భావించాల్సిన పని లేదు. చైతూ సినిమా వస్తే అదే ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ అవుతుంది.

మంచి అంచనాలే ఉన్నాయి

మంచి అంచనాలే ఉన్నాయి

గట్టి పోటీ అనుకున్న సినిమాలూ ఈ వారం తో అయిపోయాయి. వచ్చే వారానికి ‘ఆనందో బ్రహ్మ', ‘వీఐపీ-2' షెడ్యూల్ అయి ఉన్నాయి. ఈ సినిమాలపై పెద్దగా అంచనాల్లేవు కానీ.. తర్వాతి వారం రావాల్సిన రెండు సినిమాల మీద ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి.

Samantha And Naga Chaithanya Workout videos
పెద్ద పోటీ ఇచ్చే సినిమాలు

పెద్ద పోటీ ఇచ్చే సినిమాలు

ఇక ముందుకు చూస్తే 24 ప్రాంతం లో పెద్ద పోటీ ఇచ్చే సినిమాలు కూడా ఏం లేవు. దేవరకొండ విజయ్ "అర్జున్ రెడ్డి" ఆ టైమ్ లోనే ఉన్నా... మరీ ఆమాత్రం పోటీ లేకుండా ఉండటం కష్టం. ఎందుకు వెనక్కి జరిగారు అని అడిగితే మాత్రం బహుశా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఆ సమయానికి సినిమా రిలీజ్ చేయడం కష్టమవుతుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

పైసా వసూల్

పైసా వసూల్

సెప్టెంబరు తొలి వారంలో బాలయ్య ‘పైసా వసూల్' వస్తుండగా.. రెండో వారంలో మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు'.. నారా రోహిత్ ‘బాలకృష్ణుడు' షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇందులో మనోజ్ సినిమా పక్కా. రోహిత్ మూవీ ఖచ్చితంగా చెప్పలేం. ‘యుద్ధం శరణం'పై మంచి అంచనాలే ఉన్న నేపథ్యంలో ‘ఒక్కడు మిగిలాడు'కు ఇబ్బందే.

అర్జున్ రెడ్డి'కి తీపి కబురే

అర్జున్ రెడ్డి'కి తీపి కబురే

ఆగస్టు 24 నుంచి ‘యుద్ధం శరణం' వెళ్లిపోవడం ‘అర్జున్ రెడ్డి'కు తీపి కబురే. ఇప్పటికైతే వేరే చెప్పుకోదగ్గ సినిమాలేవీ ఆ ఆ వీకెండ్ కు షెడ్యూల్ అయి లేవు. ఇప్పటికే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం సోలోగా రిలీజ్ అయితే మంచి ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశముంది. 25న ‘అర్జున్ రెడ్డి' రాబోతుండగా.. ముందు రోజు తమిళ డబ్బింగ్ మూవీ ‘వివేకం' వస్తుంది. దాని వల్ల ‘అర్జున్ రెడ్డి'కి వచ్చిన ఇబ్బందేమీ లేదు.

English summary
Naga Chaitanya's Yuddham Sharanm was supposed to be released on 24th of August but it is post poned now to September 8
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu