»   » నిహారికతో ఎఫైర్?.. మేటర్ పెళ్లిదాకా?..: నాగశౌర్య ఫుల్ క్టారిటీ ఇచ్చేశాడు..

నిహారికతో ఎఫైర్?.. మేటర్ పెళ్లిదాకా?..: నాగశౌర్య ఫుల్ క్టారిటీ ఇచ్చేశాడు..

Subscribe to Filmibeat Telugu
నిహారికతో ఎఫైర్ పెళ్లిదాకా? నాగశౌర్య ఫుల్ క్టారిటీ ఇచ్చేశాడు..!

'ఊహలు గుసగుసలాడే' సినిమాలో పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో భలే మెప్పించాడు నాగశౌర్య. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం అంతగా కలిసిరాదనే చెప్పాలి. ప్రస్తుతం తన ఆశలన్నీ 'ఛలో' సినిమాపైనే. నాగశౌర్య కెరీర్ లోనే ఈ సినిమా బిగ్ రిలీజ్ కు సిద్దమైంది. ఈ సంగతి పక్కనపెడితే.. సినిమాల కంటే ఎఫైర్సే నాగశౌర్యను ఎక్కువగా వార్తల్లో నిలిపాయి. ముఖ్యంగా మెగా డాటర్ నిహారికతో రిలేషన్ పెద్ద చర్చకే దారితీసింది. వీటన్నింటిపై నాగశౌర్య తన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు..

నాగ శౌర్యకు కౌంటర్: జై బాలయ్య నినాదాలు... జై చిరంజీవి, జై అనుష్క కూడా అంటూ కవరింగ్!

 ఎఫైర్స్ గురించి:

ఎఫైర్స్ గురించి:

నా సినిమాల్లో చేసిన హీరోయిన్లతో ముడిపెట్టేస్తున్నారు. వాళ్లతో నా పెళ్లంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే వాటిల్లో ఏమాత్రం నిజం లేదు. అన్నీ పక్కా అబద్దాలే.


నిహారికతో పెళ్లిపై..:

నిహారికతో పెళ్లిపై..:

నిహారికతో నా పెళ్లంటూ జరుగుతున్న ప్రచారం నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. రాత్రి కూడా నాకు కొన్ని కాల్స్ వచ్చాయి. నేను షాక్ అయ్యాను. కానీ మా మధ్య ఎటువంటి సంబంధం లేదు. నిహారిక మాత్రమే కాదు.. ఏ హీరోయిన్ తోనూ నాకెలాంటి ఎఫైర్ లేదు.


నిహారికతో ఎఫైర్ ప్రచారం వెనుక..:

నిహారికతో ఎఫైర్ ప్రచారం వెనుక..:

నిహారిక-నాగశౌర్య కలిసి 'ఒక మనసు' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల నాగశౌర్య 'ఛలో' ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుకకు కూడా చిరంజీవి హాజరయ్యారు. నిహారిక-నాగశౌర్య మధ్య రెండేళ్లుగా ప్రేమాయణం కొనసాగుతోందని, ఇరు కుటుంబాల పెద్దలు ఈ జంటపై పాజిటివ్ గానే ఉన్నారని, అందుకే చిరంజీవి 'ఛలో' ప్రీరిలీజ్ వేడుకకు వచ్చి మరీ నాగశౌర్యను అంతలా పొగిడేశారన్న ప్రచారం జరుగుతోంది.


నాకు సిగ్గెక్కువ..:

నాకు సిగ్గెక్కువ..:

సాధారణంగా అమ్మాయిలతో మాట్లాడడానికే నేను సిగ్గు పడతాను. ఎక్కువగా ఇంట్లోనే గడుపుతాను. బయటకు వెళ్లేది కూడా తక్కువే. అసలు సెల్ ఫోన్ కూడా వాడను. నా ప్రెండ్సే నా సెల్ ఫోన్. వాళ్ల ద్వారానే అన్నీ తెలుస్తుంటాయి. కెరీర్ ఆరంభంలో ఈ పుకార్లు బాధించేవి. ఇప్పుడైతే పట్టించుకోవడం మానేశాను.


నాలుగేళ్ల తర్వాతే పెళ్లి..:

నాలుగేళ్ల తర్వాతే పెళ్లి..:

నా జీవితంలో ఇప్పటికైతే ఎవరినీ ప్రేమించలేదు. ప్రేమిస్తే మాత్రం పెద్దలతో మాట్లాడే పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే.. పెళ్లయ్యాక ప్రేమిస్తాను. ఈ తిరకాసంతా ఎందుకులెండి.. మా అమ్మ చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అది కూడా నాలుగేళ్ల తర్వాతే.


 'ఛలో' కథ..:

'ఛలో' కథ..:

ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లోని ఓ ఊరికి సంబంధించిన కథ ఇది. తన ప్రేమ కోసం ఆ ఊరికి వెళ్లిన హీరో.. అక్కడి గొడవల్లో అనుకోకుండా తలదూరుస్తాడు. ఆపై ఆ రెండు ఊళ్లను ఎలా కలిపాడనేది తెరపై చూడాల్సిందే. క్లైమాక్స్ సన్నివేశాలు ఇప్పటివరకు తెరపై చూడనివిధంగా సరికొత్తగా ఉంటాయి. దర్శకుడు వెంకీ కుడుముల అంత బాగా తెరకెక్కించాడు.


 టైటిల్ 'రాంచరణ్'దే..:

టైటిల్ 'రాంచరణ్'దే..:

ఇక సినిమా టైటిల్ గురించి చెబుతూ.. రాంచరణ్ నటించిన 'బ్రూస్ లీ' సినిమాలో 'లే ఛలో' అనే పాట నుంచి టైటిల్ తీసుకున్నట్లు నాగశౌర్య చెప్పాడు. ఈ కథకు 'ఛలో' అనే టైటిల్ బాగా సెట్ అయింది. సినిమా చూసి.. బాగా చేశావని అమ్మ కూడా మెచ్చుకుంది.


English summary
Hero Nagashaurya given clarity on affair with Mega daughter Niharika. Shaurya said all those are just rumours only.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu