Don't Miss!
- News
ఇక స్లీపర్ క్లాస్ `వందే భారత్` రైళ్లు- గంటకు 220 కిలోమీటర్ల వేగంతో: శతాబ్దికి రీప్లేస్..!!
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
పోలీసులకు దొరికిపోయిన నాగశౌర్య.. షాకిచ్చిన హైదరాబాదీ ఖాకీలు
సెలెబ్రిటీ అయినా, సాధారణ జనం అయినా చట్టం, న్యాయం ముందు అంతా సమానులే అని నిరూపించారు హైదరాబాద్ పోలీసులు. తప్పు చేస్తే ఎవ్వరికైనా ఒకే శిక్ష అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా యంగ్ హీరో నాగశౌర్యకు ఊహించని షాకిచ్చారు హైదరాబాదీ ఖాకీలు. ఇంతకీ ఏం జరిగింది? నాగశౌర్య పోలీసుల చేతికి ఎందుకు చిక్కాడు? పూర్తి వివరాలు చూస్తే..

రూల్స్ బ్రేక్ చేసిన నాగశౌర్య
తన సొంత కారుకు బ్లాక్ ఫిలిం వేసుకొని ప్రభుత్వ రూల్స్ బ్రేక్ చేశాడు నాగశౌర్య. నేరాలను అరికట్టడంలో భాగంగా కారు అద్దాలకు ఉండే బ్లాక్ ఫిల్మ్స్ తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నియమాన్ని నాగశౌర్య అతిక్రమించడంతో హైదరాబాద్ పోలీసులు ఆయనకు ఫైన్ విధించారు.

పోలీసులకు దొరకడంతో
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో తన సొంత కారులో ప్రయాణిస్తున్నాడు నాగ శౌర్య. అయితే ఆ కారుకు బ్లాక్ ఫిలిం ఉండటం గమనించిన పోలీసులు కారు ఆపి నాగశౌర్యకు 500 రూపాయల ఫైన్ వేయడం జరిగింది. కారు అద్దాలకు బ్లాక్ ఫిలింతో దొరికిన నాగశౌర్య పోలీసులకు సహకరించి ఏ మాత్రం ఆలోచించకుండా ఫైన్ కట్టాడు. చేసిన తప్పు ఒప్పుకొని మరోసారి ఇలాంటి పొరపాటు జరగనీయనని సందేశమిచ్చాడు నాగశౌర్య.

ఇటీవలే షూటింగ్‌లో ప్రమాదం
ఇటీవలే తన కొత్త సినిమా షూటింగ్ లో భాగంగా నాగశౌర్య ప్రమాదానికిగురైన సంగతి తెలిసిందే. కాలికి బలమైన గాయం కావడంతో దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ఆయన ఈ మధ్యనే కోలుకున్నారని సమాచారం. ఇప్పుడిప్పుడే నాగశౌర్య తన సినిమా సెట్స్ పైకి వెళ్తున్నారని తెలుస్తోంది.

నాగశౌర్య సినిమాలు
ఇక నాగశౌర్య సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే సమంత లీడ్ రోల్ లో వచ్చిన 'ఓ బేబీ' సినిమాలో కీలక పాత్ర పోషించి మెప్పించాడు. ఈ సినిమాలో నాగశౌర్య, సమంత అభినయం పట్ల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం తన సొంత బ్యానర్ ఇరా క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా, అదే విధంగా రాఘవేంద్ర రావు నిర్మాణంలో మరో సినిమాలో నాగ శౌర్య నటిస్తున్నాడు.