»   » నీహారిక కొణిదెల ‘ఒక మనసు’ఫస్ట్ లుక్ టీజర్ (వీడియో)

నీహారిక కొణిదెల ‘ఒక మనసు’ఫస్ట్ లుక్ టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగశౌర్య, నిహారిక నటిస్తోన్న చిత్రం 'ఒక మనసు'. రామరాజు దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ మ్యూజిక్ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సునీల్ కశ్యప్ మ్యూజిక్ డైరెక్షన్‌లో వస్తున్న ఒక మనసు సినిమాను మధురశ్రీధర్, టీవీ9 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


'ఈ మనసు చేరువుగా రా ఇలా.. నను నీలో ఆపుతూ...' అనే మెలోడి సాంగ్‌తో 'ఒక మనసు' చిత్ర మ్యూజికల్‌ టీజర్‌ విడుదలై అందరి మన్ననలూ అందుకుంటోంది.


మ్యూజికల్‌ టీజర్‌ను చిత్ర యూనిట్ సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసింది. ఇందులో కేవలం నాగశౌర్య, నిహారిక ఇద్దరు మాత్రమే కన్పించారు. నిహారిక చీరకట్టుకుని చూడముచ్చటగా ఉంది. ఈనెల 18న ఆడియోను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.


Naga Shourya’s Oka Manasu Official Teaser

ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రానికి సూపర్ క్రేజ్ వచ్చింది. మరో వైపు నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ తో యాక్టింగ్ టాలెంట్ పరంగా తానేంటో నిరూపించుకుంది. వెబ్ సిరీస్ లో అదరగొట్టిన నిహారిక సినిమాలో మరింత ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.


ఈ సినిమాలో నిహారిక తల్లి పాత్ర ప్రముఖ నటి రమ్య కృష్ణ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాలో నిహారిక తల్లి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే రమ్య కృష్ణ లాంటి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అపీషియల్ ప్రకటన రానుంది. హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు.

English summary
The much-awaited first look teaser of 'Oka Manasu' is finally out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu