»   » నాగశౌర్య ‘అబ్బాయితో అమ్మాయి’ టీజర్లు (వీడియో)

నాగశౌర్య ‘అబ్బాయితో అమ్మాయి’ టీజర్లు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగశౌర్య, పాలక్ అల్వాని జంటగా జె.జి.సినిమాస్, కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జెక్కం, కిరీటి, శ్రీనివాస్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో రీసెంట్ గా విడుదల చేశారు. ఆ టీజర్ ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిర్మాతలు మాట్లాడుతూ.... ఓ అందమైన ప్రేమకథ దర్శకుడు చెప్పగా, ఆ పాత్రకు నాగశౌర్య సరిపోతాడని, ఈ చిత్రాన్ని చేశామని, ప్రేమకథా చిత్రాల్లో ఓ మైలురాయిగా ఈ సినిమా నిలుస్తుందని, ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేస్తున్నామని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తామని వారు తెలిపారు.

"మూడున్నర యేళ్ళ ప్రయాణం ఈ చిత్రం. నేను హీరో అవుతాననే నమ్మకంతో నా గురించి రాసిన మొదటి కథ ఇది. నా డేట్స్ కోసం ఎదురు చూశానని చెప్తుంటే సిగ్గేస్తుంది. ఓ హిట్ చిత్రంలో నన్ను భాగస్వామిని చేశారు. ఇళయరాజా గారి సంగీతంలో నటించాలని నా కల. ఆ కలను నెరవేర్చిన దర్శకుడు రమేష్ వర్మ. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు" అని హీరో నాగశౌర్య అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన కిరీటి పోతిని మాట్లాడుతూ.. "ఇళయరాజా గారితో మా ప్రయాణం ప్రారంభించడం సంతోషంగా ఉంది. నా స్నేహితుడు శంకర్ ప్రసాద్ అబ్బాయి నాగశౌర్య. నా కొడుకుతో సమానం. నిర్మాణంలో అడుగుపెట్టాలనే మా కల నిజం కావడానికి కారణం రమేష్ వర్మ. అద్బుతమైన కథ ఇచ్చాడు. త్వరలో ఆడియో విడుదల చేస్తున్నాం" అన్నారు.

Naga Sourya's Abbayitho Ammayi Movie Teaser

మల్టీడైమెన్షన్ వాసు మాట్లాడుతూ.. "యేడాది క్రితం రమేష్ వర్మ మంచి కథ చెప్పాడు. కథకు నాగశౌర్య బాగా సూటవుతాడని అతని డేట్స్ కోసం యేడాది పాటు వెయిట్ చేశాం. ప్రేమకథలో ఓ ల్యాండ్ మార్క్ చిత్రం అవుతుంది. ఇళయరాజా, శ్యామ్ కె.నాయుడు వాంతి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు" అన్నారు.

బ్రహ్మానందం, రావు రమేష్, మోహన్, ప్రగతి, తులసి తదితరులు నటిస్తున్న చిత్రానికి సాహిత్యం : రెహమాన్, ఛాయాగ్రహణం : శ్యామ్ కె నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : మురళికృష్ణ, నిర్మాతలు : వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట.

English summary
Here it is Naga Soury'a upcoming film Abbayitho Ammayi Teaser. Directed by Ramesh Varma. Music by Ilaiyaraja. Produced by Kireeti Potini.
Please Wait while comments are loading...