»   » పక్కా మాస్: నాగశౌర్య ‘జాదూగాడు’ టీజర్ (వీడియో)

పక్కా మాస్: నాగశౌర్య ‘జాదూగాడు’ టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగశౌర్య హీరోగా సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వి.వి.యన్‌. ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘జాదూగాడు' అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘చింతకాయల రవి' ఫేమ్‌ యోగేశ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. జాతీయ టెలివిజన్‌ సీరియల్‌ ‘హర హర మహాదేవ'లో పార్వతి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న సోనారిక ఈ చిత్రం ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు. పక్కా మాస్ లుక్ తో సాగే ఈ టీజర్ ని మీరు చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుదర్శకుడు యోగేశ్‌ మాట్లాడుతూ ‘‘నాగశౌర్య పోషిస్తున్న పాత్ర అతని గత పాత్రలకు భిన్నంగా ఉంటుంది. అలాగే నాగశౌర్య ఇప్పటివరకు ప్రేమ కధా చిత్రాల హీరోగా నటించారు. కానీ ఈ చిత్రం లో అతని పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం లో హీరో పాత్రను తీర్చి దిద్దటం జరిగిందని తెలిపారు. వినోదంతో కూడిన మాస్ కధా చిత్రం ఈ 'జాదూగాడు' అన్నారు.'' అని చెప్పారు.


నిర్మాత వి.వి.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ..‘‘పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నఈ ‘జాదూగాడు' షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.''అని నిర్మాత వి.వి.ఎన్.ప్రసాద్ తెలిపారు.


Naga Sourya's Jadoogadu Movie Official Teaser

ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు,అజయ్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్, జాకీర్ హుస్సేన్, ఆశిష్ విద్యార్ధి, రవి కాలే, ‘ప్రబాస్' శ్రీను, ‘రాకెట్' రాఘవ,‘అదుర్స్' రఘు, స్వామిరారా సత్య, ఫిష్ వెంకట్ లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: మధుసూదన్‌, పాటలు: వరికుప్పల యాదగిరి, శ్రీమణి, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌.

English summary
Here is the first look for Naga Sourya's upcoming film Jadoogadu movie teaser. Starring Sonarika. This movie is directed by Yogesh (chinthakayala ravi, oka raju oka rani ) and produced by VVN Prasad under the banner Sathya Entertainments. Music of the film composed by Saagar Mahati.
Please Wait while comments are loading...