For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ ఫ్యాన్: మెగా బ్రదర్ నాగబాబు ఇక ‘టవర్ స్టార్’

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.......కానీ మెగా బ్రదర్ నాగబాబుకు మాత్రం ఇప్పటి వరకు వెండితెరపై ఎలాంటి బిరుదు లేదు. ఈ విషయాన్ని గ్రహించిన దర్శకుడు తేజ ఆయన పేరు ముందు 'టవర్ స్టార్' అనే బిరుదు చేర్చారు.

  తేజ దర్శకత్వంలో వస్తున్న '1000 అబద్దాలు' చిత్రంలో నాగబాబు 'టవర్ స్టార్'గా కనిపించనున్నారు. అయితే ఈ బిరుదు ఈ సినిమా కోసం ఫన్నీగా పెట్టిందేనట. ఈ చిత్రంలో నాగబాబు కామెడీ సీన్లతో తెగ నవ్విస్తాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈచిత్రంలో ఆయన పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించనున్నాడు.

  చాలా కాలంగా సరైన హిట్ లేని తేజ...ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో చాలా ప్రయోగాలే చేసాడు ఇందులో. ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపించటంలో తనదైన శైలితో ఆకట్టుకొనే తేజ తాజాగా ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాటని చిత్రీకరించబోతున్నాడు. 1950 నుంచీ 1980 మధ్యకాలంలో హీరోయిన్స్ ల చిత్రాల్లోని అందమైన పాటల క్లిప్పింగ్‌లను ఈ స్పెషల్ సాంగ్‌లో పొందుపరచనున్నాడు.

  'వందేళ్ల భారతీయ సినిమా'లో తెలుగు తేజం ఏ విధంగా వెలుగొందిందీ రేపటి తరానికి ఈ పాట రూపేణా తెలియజెప్పనున్నాడు. ఆనాటి సుప్రసిద్ధ నటీమణులు అంజలీదేవి, కాంచన, విజయనిర్మల, సరోజాదేవి, జమున, భారతి తదితరుల భావస్ఫూరిత చిత్ర మాలికలను ఈ పాటలో నిక్షిప్తం చేయనున్నారు.

  తేజ మాట్లాడుతూ- ''పెళ్లంటే నూరేళ్ల పంట. నూరేళ్ల పంటను పండించడానికి '1000 అబద్ధాలు' అడితే తప్పుకాదు అని మన పెద్దలే చెప్పారు. ఒకరు ఆ మాటనే ఆదర్శంగా తీసుకున్నారు. 1000 అబద్ధాలతో అనుకున్న వ్యక్తిని పెళ్లాడి తమ కలను సాకారం చేసుకున్నారు. ఇంతకీ ఇన్ని అబద్దాలు అడింది అమ్మాయా? అబ్బాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అసలు ఇంతటి కఠోరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం సదరు వ్యక్తికి ఎందుకొచ్చింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం'' అని చెప్పారు.

  ఎస్తర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, నరేష్, చలపతిరావు, బాబూమోహన్, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్, కొండవలస, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: రమణగోగుల, కెమెరా: రసూల్ ఎల్లోర్, కళ: నరసింహవర్మ, ఎడిటింగ్: శంకర్, పాటలు: అరిశెట్టి సాయి, పోతుల రవికిరణ్. సమర్పణ: చిత్రం మూవీస్, నిర్మాణం: శ్రీప్రొడక్షన్స్.

  English summary
  Mega Brother Naga Babu maintains good relationship with his younger brother Power Star Pawan Kalyan. Now, Naga Babu is playing an ardent fan of his brother in an upcoming film. Naga Babu is playing a hilarious role named Tower Star for the film "1000 Abaddalu" in which he will be seen as a fan of Pawan Kalyan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X