»   » చిరు, పవన్‌తో రాజశేఖర్ గతంలో విబేధాలెలా?

చిరు, పవన్‌తో రాజశేఖర్ గతంలో విబేధాలెలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికీ డాక్టర్ రాజశేఖర్ మధ్య వచ్చిన కలతలు తొలిగిపోతున్న సంగతి తెలిసిందే. రకరకాల కారణాలు, పరిస్థితుల వల్ల గతంలో మనస్పర్ధలు చోటు చోటుచేసుకున్నాయి. అయితే నాగబాబు చొరవతో అవి మరిచి మళ్లీ ఇద్దరూ దగ్గరవుతున్నారు. ఈ ఇరువురి మధ్య మనస్పర్దలకు తెరపడింది. ఈ విషయాన్ని రాజశేఖర్ స్వయంగా తెలియజేశారు. అంతేకాకుండా చిరంజీవికి తన తాజా చిత్రం గడ్డం గ్యాంగ్ స్పెషల్ షో వేస్తానని అన్నారు. అందునిమిత్తం ఆయన్ని ఇన్వేట్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అయితే గతంలో చిరంజీవి ఫ్యామిలీకి రాజశేఖర్ కుటుంబానికి గొడవలు ఎందుకొచ్చాయనే విషయంలో పెద్దగా క్లారిటీ లేదు. అయితే తాజాగా ఫిల్మ్ నగర్లో ఈ విషయమై చర్చ సాగుతోంది. గతంలో సినిమా రంగంలో తన ఎదుగుదలకు చిరంజీవి అండ్ కో అడ్డుతగులుతూ వచ్చారనే భావన రాజశేఖర్‌లో ఉండేదని, ఆ క్రమంలోనే రాజకీయ కారణాలు కూడా తోడయ్యాయని...అలా వీరి మధ్య చిన్నగా మొదలైన విబేధాలు ఆ మధ్య తారా స్థాయికి చేరాయని అంటున్నారు.

Nagababu helped Rajasekhar in Solving Issues with Chiru

చిరంజీవి నటించిన ‘ఠాగూర్' మూవీ తమిళ హిట్ మూవీ ‘రమణ'కు రీమేక్. వాస్తవానికి ఈ చిత్రం రీమేక్ రైట్స్ రాజశేఖర్ దక్కించుకుని నటించాలని భావించాడని, అయితే చిరంజీవి ఆ సినిమా తనకు దక్కకుండా చేసారనే కోపం గతంలో రాజశేఖర్ లో ఉండదని చర్చించుకుంటున్నారు.

అతే కాకుండా హిందీ హిట్ మూవీ ‘దబాంగ్' చిత్రాన్ని రాజశేఖర్ రూ. 1.35 లక్షలకు దక్కించుకోవాలని చూసారని, అయితే పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని 1.75 లక్షలకు ఎగరేసుకెళ్లారని.....ఇలా సినిమా రంగానికి సంబంధించిన విషయాలే వీరి మధ్య గతంలో విబేధాలకు దారి తీసాయని, తర్వాత రాజకీయ కారణాలు తోడయ్యాయిన అంటున్నారు.

జరిగింది ఏదో జరిగి పోయింది. పరిస్థితుల ప్రభావమో, లేక మరేకారణమో మొత్తానికి చిరంజీవి, రాజశేఖర్ కుటుంబాల మధ్య విబేధాలు తొలగి పోయాయి. ఇక అంతా సజావుగా సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more about: chiranjeevi, rajasekhar
English summary
Megastar Chiranjeevi and Rajasekhar were close buddies few years back. Don’t know what exactly happened in between, they fired on one another. Nagababu helped Rajasekhar in Solving Issues with Chiru.
Please Wait while comments are loading...