For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అపోలో బిల్లులపై నాగబాబు కామెంట్స్: మెగా హీరోలు అలాంటి పనులు.. ఉపాసన ఆ మాట చెప్పిందంటూ!

  |

  సినిమా నటుడిగా, నిర్మాతగా, బుల్లితెరపై సందడి చేసే జడ్జ్‌గా దాదాపు మూడు దశాబ్దాల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ అన్ని విభాగాల్లోనూ హవాను చూపిస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు. పేరుకు మెగస్టార్ చిరంజీవి సోదరుడే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన.. బయట విషయాలపైనా తరచూ స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో అపోలో ఆస్పత్రిలో కరోనా బిల్లులపైన.. కీలక సమయంలో మెగా హీరోలు చేస్తున్న పనులపైనా నాగబాబు స్పందించారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  అలా మొదలైన కెరీర్.. అన్నింట్లో

  అలా మొదలైన కెరీర్.. అన్నింట్లో

  ‘రాక్షసుడు' అనే సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు నాగబాబు. అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను చేశారు. అలాగే, హీరోగానూ కనిపించారు. ఈ క్రమంలోనే నిర్మాతగా మారారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత' వరకు ఆయన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు. వీటితో పాటు సీరియళ్లు, టీవీ షోలలోనూ చేస్తూ మెప్పిస్తున్నారు.

  అలాంటి వాటిపై స్పందిస్తూ ఇలా

  అలాంటి వాటిపై స్పందిస్తూ ఇలా

  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నాగబాబు.. సమాజంలో జరిగే ఎన్నో విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు పలు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. అయినప్పటికీ తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెబుతుంటారు. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అదే సమయంలో మంచి మంచి పనులు చేసిన వారిని సైతం ప్రోత్సహిస్తున్నారు.

  హెల్పింగ్ ఈవెంట్‌లో నాగబాబు

  హెల్పింగ్ ఈవెంట్‌లో నాగబాబు

  కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తోంది. ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ముందుకొచ్చి అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. ఇలా తాజాగా అభిమానులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు పాల్గొన్నారు.

  మెగా హీరోల పనులపై కామెంట్

  మెగా హీరోల పనులపై కామెంట్

  ఈ సందర్భంగా నాగబాబు మెగా హీరోల గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ‘కరోనా టైంలో మెగా హీరోలంతా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నయ్య చరణ్‌తో కలిసి ఆక్సీజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కల్యాణ్ బాబు కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు. అలాగే, నేను కూడా చాలా మందికి వైద్యం చేయించాను. మా ఫ్యాన్స్ కూడా సాయం చేస్తున్నారు' అని చెప్పారు.

  చెప్పుకోవడం ఇష్టం ఉండదంటూ

  చెప్పుకోవడం ఇష్టం ఉండదంటూ

  ఇక, తాము చేసే సేవల గురించి మాట్లాడుతూనే విమర్శలను ఖండించారు నాగబాబు. ‘అన్నయ్య కానీ, కల్యాణ్ బాబు కానీ, నేను కానీ, మా మెగా హీరోలు కానీ ఏదైనా సహాయం చేస్తే బయటకు చెప్పుకోడానికి ఇష్టపడము. అందుకే మేము చేసిన చాలా పనులు బయటకు రాలేదు. ఇప్పటికీ మేమూ.. మా పిల్లలు సైలెంట్‌గా హెల్ప్ చేస్తూ వెళ్తున్నాము' అని చెప్పుకొచ్చారాయన.

  అపోలో బిల్లులపై స్పందించారు

  అపోలో బిల్లులపై స్పందించారు

  ఈ సందర్భంగానే మెగా కోడలు ఉపాసనా కామినేని గురించి నాగబాబు కామెంట్లు చేశారు. ‘కరోనా సమయంలో చాలా కార్పోరేట్ ఆస్పత్రులు లక్షల లక్షల బిల్లులు వేస్తున్నారు. కానీ, అపోలో లాంటి పెద్ద ఆస్పత్రిలో కరోనా పేషెంట్లకు చాలా తక్కువ మొత్తానికి వైద్యం అందిస్తున్నారు. బిల్లులు కూడా చాలా అంటే చాలా తక్కువే వేస్తున్నారు' అంటూ పేర్కొన్నారు మెగా బ్రదర్.

  Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
  ఉపాసనపై నాగబాబు ప్రశంసలు

  ఉపాసనపై నాగబాబు ప్రశంసలు

  అపోలో బిల్లుల గురించి మాట్లాడుతూ ఉపాసనపై ప్రశంసల వర్షం కురిపించారు నాగబాబు. ‘అపోలోలో తక్కువ బిల్లులు వేస్తున్నారని ఉపాసనతో మాట్లాడితే.. కార్పోరేట్ ఆస్పత్రి అయినా క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే బిల్లులు తక్కువగా వేస్తున్నాం అని చెప్పింది. అప్పుడు తను మా అన్నయ్యకు తగ్గ కోడలు అనిపించింది' అని వెల్లడించారాయన.

  English summary
  Senior Actor, Mega Brother Nagababu Recently Participated in An Event. In This Program He Commented on Apollo Bills and Praises Upasana Kamineni and All Mega Heros.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X