»   » ఏ దరిద్రుడో ఇలా, బూతు అంటే ఒప్పుకోను... నిహారికపై, ఆ టీవీషోపై నాగబాబు

ఏ దరిద్రుడో ఇలా, బూతు అంటే ఒప్పుకోను... నిహారికపై, ఆ టీవీషోపై నాగబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sai Dharam Tej - Niharika marriage Rumoursఏ దరిద్రుడో ఇలా, బూతు అంటే ఒప్పుకోను. నిహారికపై

మెగా ఫ్యామిలీ గురించి ఏదైనా తప్పుడు వార్తలు వచ్చినా, ఏదైనా వివాదాలు, గాసిప్స్ ప్రచారంలోకి వచ్చినా.... మెగాఫ్యామిలీ హీరోల తరుపున వెంటనే మీడియా ముందుకొచ్చి స్పందించే వ్యక్తి మెగా బ్రదర్ నాగబాబు. ఏ విషయాన్నైనా నాన్చకుండా, తన మనసులో ఏదుంటే అది బయటకు చెప్పేసే నాగబాబును అంతా బోలాశంకరుడు అని కూడా అంటుంటారు.

ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో చాలా విషయాలపై స్పందించారు. సాధారణంగా నాగబాబు ఇంటర్వ్యూ అంటే అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్, మెగా అభిమానుల గురించిన విషయాలే ఉంటాయి. అయితే ఈ సారి ఆయన తన ముద్దుల కూతురు నిహారిక, కుమారుడు వరుణ్ తేజ్, తన జబర్దస్త్ షో గురించిన విషయాలపై కూడా ఆసక్తికరంగా స్పందించారు.

వరుణ్ తేజ్ గురించి

వరుణ్ తేజ్ గురించి

తన వారసుడు వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ.... ఇప్పటి వరకు హీరోగా వెళతానన్నపుడు ఎంకరేజ్ చేశాను. మూడేళ్ల ట్రావెల్‌లో కొన్ని మంచి సినిమాలు చేశాడు. వరున్ కెరీర్లో ఫిదా తొలి బ్లాక్ బస్టర్.... అని నాగబాబు అన్నారు.

ఆ సినిమా పెద్ద ప్లాప్

ఆ సినిమా పెద్ద ప్లాప్

‘ఫిదా' ముందు సినిమా మిస్టర్ పెద్ద ఫెయిల్యూర్. దాని ముందు సినిమా లోఫర్ బిలో యావరేజ్. కంచె, ముకుంద సినిమాలకు మంచి పేరొచ్చింది.... అని నాగబాబు అన్నారు.

మావాడికి చాలా ఆలస్యం అయింది

మావాడికి చాలా ఆలస్యం అయింది

కొత్తగా వచ్చిన ఏ హీరోకు అయినా తొలినాళ్లలో ఒక పెద్ద హిట్ అనేది అవసరం. అ లెక్కన చూసుకుంటే... చాలా మంది హీరోలకు ముందే వచ్చాయి. చరణ్ బాబుకు చిరుత, మగధీరతో ఓపెనింగులోనే హిట్లు కొట్టాడు. వరుణ్ బాబుకకు ఫస్ట్ పిక్చర్ యావరేజ్ అయినా, సెకండ్ పిక్చర్(కంచె) హిట్ కొట్టాడు. అన్నయ్య చిరంజీవి, తేజు... అందరూ బిగినింగులోనే హిట్లు కొట్టారు... అని నాగబాబు అన్నారు.

ఫిదాతో మావాడు ఆర్బిట్‌లోకి వెళ్లాడు

ఫిదాతో మావాడు ఆర్బిట్‌లోకి వెళ్లాడు

బ్లాక్ బస్టర్ అనేది శాటిలైట్‌ను ఆర్బిట్‍లోకి పెట్టము లాంటిది. ఒకసారి ఆర్బిట్‌లోకి వెళ్లిన తర్వాత వర్క దానంతట అదే మొదలవుతుంది. ‘ఫిదా' తో ఆర్బిట్ లోని స్టార్స్‌లో వరుణ్ జాయిన్ అయ్యాడు... అని నాగబాబు అన్నారు.

ఇకపై వాడే చూసుకోవాలి

ఇకపై వాడే చూసుకోవాలి

ఇకపై వరుణ్ కెరీర్ గురించి అతడే కేర్ తీసుకుంటాడు. నాకు రెస్పాన్స్ బిలిటీ నుండి రిలీఫ్ లభించింది. సొంతగా సినిమాలు ఎంచుకోగలిగే స్టెబిలిటీ వచ్చింది. మాగ్జిమమ్ రెస్పాన్సిబిలిటీ తగ్గింది.

ఫిదా నాకు చెప్పలేదు, పాట కూడా వినిపించలేదు. పూర్తిగా అతడి జడ్జిమెంట్... అని నాగబాబు అన్నారు.

నమ్మకం వచ్చింది

నమ్మకం వచ్చింది

నా జడ్జిమెంటు లేకుండా, నా ఇన్వాల్వ్ మెంట్ లేకుండా, సలహాలు లేకుండా, నాతో సంబంధం లేకుండా ఎప్పుడైతే ఆ జడ్జిమెంటుకు సక్సెస్ వచ్చిందో తను ఒక మంచి దారిలో వెలుతున్నాడనే నమ్మకం వచ్చింది.... అని నాగబాబు తెలిపారు.

ఏ దరిద్రుడు క్రియేట్ చేశాడో

ఏ దరిద్రుడు క్రియేట్ చేశాడో

సాయి ధరమ్ తేజ్, నిహారిక పెళ్లి గాసిప్ మీద నాగబాబు స్పందిస్తూ... అదొక ఫూలిష్ న్యూస్, ఏ దరిద్రుడు క్రియేట్ చేశాడో తెలియదు.... అని నాగబాబు అన్నారు.

నిహారికను సాయి ధరమ్ తేజ్ ఎత్తుకుని ఆడించాడు

నిహారికను సాయి ధరమ్ తేజ్ ఎత్తుకుని ఆడించాడు

సాయి ధరమ్ తేజ్, నిహారిక చిన్నతనం నుండి అన్న చెల్లెల్లా పెరిగారు. చిన్నప్పటి నుండి వాడు నిహారినకను ఎత్తుకుని ఆడించాడు. వారు ఎప్పుడూ అలా ఉండేవారు కాదు... అని నాగబాబు అన్నారు.

బూతు అంటే ఒప్పుకోను

బూతు అంటే ఒప్పుకోను

జబర్దస్త్ మీద వల్గారిటీ, బూతు అనే ఆరోపణలను నేను ఒప్పుకోను. సమాజాన్ని నాశనం చేసేంత తప్పుడు పనులేమీ చేయడం లేదు.... అని విమర్శలను తిప్పికొట్టారు నాగబాబు.

డబుల్ మీనింగ్ డైలాగ్స్ మీద

డబుల్ మీనింగ్ డైలాగ్స్ మీద

జబర్దస్త్ షోలో కామెడీ టైమింగులో ఒక్కోసారి డబల్ మీనింగ్ డైలాగులు టంగ్ స్లిప్ అయి వస్తుంటాయి. 80 శాతం క్లీన్... అప్పుడప్పుడు కొన్ని డబల్ మీనింగులు దొర్లుతుంటాయి.... అని నాగబాబు సమర్ధించుకున్నారు.

జనాలు పిచ్చోళ్లు కాదు

జనాలు పిచ్చోళ్లు కాదు

జబర్దస్త్ ఆపేస్తాం అంటే ఊరుకోం, మేము వచ్చి స్ట్రైక్ చేస్తామని చాలా మంది అన్నారు. కొందరు విమర్శించారని వదిలేయలేం, దాన్ని లెక్క చేయను. కొన్ని సార్లు తప్పులు జరిగితే మా వాళ్లు క్షమాపణ కోరుకోవడం జరిగింది. జబర్దస్త్ ఆల్వేస్ హెల్దీయెస్ట్ కామెడీ, లేకపోతే ఇంతలా రన్ అవ్వదు. ఈ షోను హిట్ చేయడానికి జనాలు పిచ్చోళ్లు కాదు.... అని నాగబాబు అన్నారు.

అలా అంటే నోరా, తాటి మట్టా?... మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్‌‌పై నాగబాబు కామెంట్!

అలా అంటే నోరా, తాటి మట్టా?... మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్‌‌పై నాగబాబు కామెంట్!

మెగా ఫ్యామిలీ నుండి దాదాపు అరడజను మంది హీరోలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. ఈ నేపథ్యంలో మీకు మెగా ఫ్యామిలీ నుండి కాకుండా బయటి హీరోలపై.....

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బన్నీ తెలియక తప్పు చేశాడు : ఫ్యాన్ గొడవ ఇష్యూపై నాగబాబు!

బన్నీ తెలియక తప్పు చేశాడు : ఫ్యాన్ గొడవ ఇష్యూపై నాగబాబు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ మెగా హీరో ఫంక్షన్ జరిగినా.... అక్కడ పవన్ కళ్యాణ్ కనిపించక పోతే రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అరుపులు, కేకలతో ఫంక్షన్ కు ఇబ్బందులు కలిగించిన సందర్భాలు...

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అన్నయ్య రమ్మంటే వచ్చా... ఫెయిల్ అయ్యాను: నాగబాబు

అన్నయ్య రమ్మంటే వచ్చా... ఫెయిల్ అయ్యాను: నాగబాబు

నాగబాబు సినిమా ఇండస్ట్రీలోకి నిర్మాతగా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే నిర్మాతగా ఆయన ఫెయిల్ అయ్యారు. తాను ఈ రంగం అన్నయ్య రమ్మంటేనే వచ్చానని నాగబాబు వ్యాఖ్యానించడం గమనార్హం...

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Nagababu rubbishes news about Sai Dharam Tej- Niharika marriage. Naga Babu made it clear that this is not true. He also talked about Varun Tej's films and Jabbarthat's controversies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu