For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సత్యం వధ ధర్మం చర.. ప్రస్తుతం అర్థం మారిపోయిందంటా.. నాగబాబు సెటైర్స్

  |

  మెగా బ్రదర్ నాగబాబు నాథురాం గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు ఎంతగా సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యల సెగ మెగా కుటుంబానికి, జనసేన పార్టీకి తగిలాయి. రాజకీయ నాయకులు నాగబాబును మాత్రమే కాకుండా మెగా కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారు. కొంతమంది నాగబాబుపై పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంత జరుగుతున్నా.. నాగబాబు మాత్రం వెనకడగు వేయడం లేదు. తాజాగా మరో ట్వీట్ చేశాడు.

  కాంట్రవర్సీకి తెరదీసిన ట్వీట్..

  కాంట్రవర్సీకి తెరదీసిన ట్వీట్..

  నాగబాబు చేసిన ట్వీట్ల సారాంశం.. ‘ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం. కానీ, అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే)' అని చెప్పారు.

   ఆయన దేశభక్తిని శంకించలేం...

  ఆయన దేశభక్తిని శంకించలేం...

  'గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్'అని పేర్కొన్నాడు.

   నాగబాబు వివరణలు..

  నాగబాబు వివరణలు..

  ఈ ట్వీట్లపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నాగబాబు వివరణ ఇచ్చుకున్నాడు. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్‌లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలని మాత్రమే అన్నాను. నాకు మహాత్మగాంధీ అంటే నాకు చాలా గౌరవం. వాస్తవానికి నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవమ'ని చెప్పుకొచ్చాడు. మరో ట్వీట్ చేస్తూ.. ‘నేను ఏమి ట్వీట్ చేసినా, అందులో ఏమున్నా, అది నా వ్యక్తిగత బాధ్యతే. జనసేన పార్టీకిగానీ, మా కుటుంబంలోని మరెవరికైనాగానీ నా అభిప్రాయాలతో ఎటువంటి ప్రమేయమూ లేద'ని చెప్పుకొచ్చాడు.

   విజయశాంతి, ఆర్జీవిలు కామెంట్స్..

  విజయశాంతి, ఆర్జీవిలు కామెంట్స్..

  నాగబాబు కామెంట్స్‌పై విజయశాంతి సెటైర్స్ వేయగా.. ఆర్జీవీ మద్దతు పలికాడు. నాగబాబు చెప్పింది నిజమనీ, ఆ సమయంలో ఆయన అభిప్రాయాన్ని ఎవ్వరూ ప్రచురించలేదని, గాడ్సేపై సినిమా కూడా తీస్తానని సంచలన ప్రకటన చేశాడు.

   తాజాగా నాగబాబు మరో ట్వీట్..

  తాజాగా నాగబాబు మరో ట్వీట్..

  సత్యం చాలా కఠినంగా ఉంటుందని ఓ ట్వీట్ చేసిన నాగబాబు తాజాగా మరో పోస్ట్ చేశాడు. ‘సత్యం వద ధర్మం చర..అంటే (speak the truth,,live the righteous life)నిజం మాట్లాడాలి,,న్యాయం గా జీవించాలి అని అర్థం.కానీ ఎవరో ప్రస్తుత పరిస్థితిని దృష్టి లో పెట్టుకొని వ్యంగ్యంగా అన్న మాట,,,సత్యం వధించబడింది,,ధర్మం చెరసాల పాలైనది అన్నారు.వ్యంగంగా అన్నా ఇదే కరెక్ట్ అనిపిస్తుంద'ని ఓ సెటైర్ వేస్తున్నారు.

  Nathuram Godse Has Patriotism, Media Didn't Project His View That Time: Nagababu
   నాగబాబు కామెంట్లపై భిన్నాభిప్రాయాలు..

  నాగబాబు కామెంట్లపై భిన్నాభిప్రాయాలు..

  గాడ్సేపై నాగబాబు చేసిన కామెంట్లపై భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. చాలా మంది నాగబాబు వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. నాగబాబు ట్వీట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

  English summary
  Nagababu Satires on People WHo Targets Him About Nathuram Godse Tweet.Nagababu Says That Comments on Nathuram Godse Is His Personnel Only.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X