Don't Miss!
- News
`ఆ మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది`- మెగాస్టార్..!!
- Finance
Stock Market: బడ్జెట్ కి ముందు లాభాల ప్రారంభం.. కానీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ మూడ్ ఇదే..
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Maa Elections: మంచు విష్ణు గెలుపు.. రాజీనామాతో నాగబాబు షాకింగ్ రియాక్షన్
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మొత్తానికి ఊహించని ఫలితాలను అందించాయి. దాదాపు ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలుపు ఖాయమని చాలామంది అనుకున్నారు. కానీ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు 100 కోట్లకు పైగా మెజారిటీతో గెలవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక గెలుపు గల కారణాలను పక్కనపెడితే ఫలితాల తర్వాత మరోసారి పరిణామాలు ఊహించని విధంగా చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొందరు ప్రముఖులు ఫలితాలపై అసంతృప్తిగానే ఉన్నట్లుగా అర్థమవుతోంది. మంచు విష్ణు గెలవగానే నాగబాబు ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నారు.

మొదటి నుంచి కూడా ప్రకాష్ రాజ్ కు మద్దతుగా
నాగబాబు మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ కు మద్దతు పలుకుతూ వచ్చారు. శివాజీ రాజా నరేష్ ప్యానెల్ తరువాత చాలామంది పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందుకే కొత్త తరహా ప్యానల్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రకాష్ రాజు వైపు మద్దతు పలికారు. దాదాపు ప్రతి సమావేశంలో పాల్గొన్నారు ఆయనకు మద్దతుగా ప్రచారాలను కొనసాగించారు.

సభ్యత్వానికి రాజీనామా
ఎన్నికల్లో ఎక్కువగా రాజకీయాల తరహాలో విమర్శలు చేయడం కూడా జరిగింది. ఇక ఫలితాలు కూడా చివరి రోజు తారుమారు అయ్యే విధంగా వాతావరణం క్రియేట్ అయిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక మంచు విష్ణు వెళ్లడంతో నాగబాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ నిర్ణయం మా కమిటీలో హాట్ టాపిక్ గా మారింది.

కొనసాగడం ఇష్టం లేక..
ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు - మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక " మా " అసోసియేషన్లో ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఇక సెలవు అంటూ నాగబాబు వివరణ ఇచ్చారు. నా రాజీనామా పత్రాన్ని అసోసియేషన్ కు 48గంటల్లో నా స్టాఫ్ ద్వారా అందజేస్తానని చెబుతూ.. ఇది నేను ఎంతగానో ఆలోచించి , ప్రలోభాలకు అతీతంగా నా పూర్తి చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం అని అన్నారు.

మెగాస్టార్ రియాక్షన్
ఇక మెగాస్టార్ చిరంజీవి ' మా ' నూతన అధ్యక్షుడి గా ఎన్నికైన మంచువిష్ణుకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ కి మిగతా విజేతలందరికీ పేరు పేరునా నా అభినందనలు శుభాకాంక్షలు అంటూ ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను అన్నారు. ఇక ' మా ' ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబమని.. ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే.. ఆ స్ఫూర్తి తోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను అని చిరంజీవి వివరణ ఇచ్చారు.
Recommended Video

మంచు విష్ణు కామెంట్స్
ఇక గెలిచిన సందర్భంగా మంచు విష్ణు చాలా పాజిటివ్ గా స్పందించారు. నిన్నా మొన్నటి వరకు కూడా ఏం జరిగింది అనేది అనవసరం ఇప్పుడు ఏం చేస్తాము అనేది చాలా ముఖ్యం. మా సభ్యులందరికి కూడా సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాము. అలాగే భవిష్యత్తు మళ్ళీ ఇలా మా గొడవలు మీడియా ముందు వరకు రాకుండా తమలోనే పరిష్కరించుకునే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా అన్నారు.