»   » మళ్లీ చేస్తున్నాడు : 'మజ్ను' లో నాగార్జున

మళ్లీ చేస్తున్నాడు : 'మజ్ను' లో నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు 'మజ్ను' అనగానే నాగార్జునే గుర్తుకొస్తారు. విషాదంతో కూడిన ఆ ప్రేమకథా చిత్రంలో నాగార్జున అంతగా ఒదిగిపోయి నటించారు. ఇప్పుడు 'మజ్ను' పేరుతో నాగార్జున తనయుడు నాగచైతన్య చేయబోతున్న చిత్రంలో, నాగచైతన్య కి తండ్రిగా అలనాటి 'మజ్ను' నాగార్జున కూడా నటిస్తున్నరని సమాచారం.

తండ్రి చేసిన 'మజ్ను' విషాదంతో సాగితే... తనయుడు చేసే సినిమా మాత్రం వినోదాత్మకంగా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో చాయ్ కి సంబందించిన ఓ స్పెషల్ రోల్ లో వెంకటేష్ నటిస్తారన్న సంగతి తెలిసిందే.

Nagarajuna’s cameo in Naga Chaitanya’s film?

మలయాళంలో విజయవంతమైన 'ప్రేమమ్‌'ని తెలుగులో 'మజ్ను'గా రీమేక్‌ చేస్తున్నసంగతి తెలిసిందే. తొలిసారి నాగచైతన్య, శ్రుతి హాసన్‌ కలిసి నటిస్తున్నారు. 'కార్తికేయ' చిత్రంతో విజయాన్ని అందుకొన్న చందు మొండేటి దర్శకత్వం వహిస్తారు.

జార్జ్ అనే కుర్రాడు టీనేజ్ లో, కాలేజ్ లో , సెటిలేజ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వారి ప్రేమను సాధించుకోవటం లో ఊహించని అడ్డంకులు ఎదురై ,కలలు కరిగిపోయి ప్రేమించిన వారు మరొకరితో సెటిల్ అవ్వతుంటే తట్టుకోలేక గుండె పగిలేలా.. ఇలా కథ సాగుతుంది.

Nagarajuna’s cameo in Naga Chaitanya’s film?

ఇక నివిన్ పౌలీ ఈ చిత్రంతో హీరో గా పరిచయమయ్యారు. ఆల్ఫోన్సే పూతరేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కింది. మే 29న విడుదలయిన ఈ చిత్రం పెద్ద హిట్టయ్యింది.

జూన్ నెలలో విడుదలైన ఈ 'ప్రేమమ్' చిత్రం టాక్ బాగుండటంతో ... విదేశాలలోనూ విడుదల చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా వసూళ్ళు యాభై కోట్లకు చేరుకున్నాయి. మళయాళ పరిశ్రమలో ఇలా లో బడ్జెట్ చిత్రం ఈ రేంజిలో హిట్ అయ్యి..ఇంత వసూలు చేయటం పెద్ద రికార్డు. ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం తమిళ, కన్నడ భాషల నుండే కాకుండా హిందీ పరిశ్రమనుండీ మంచి డిమాండ్ ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

English summary
Malayalam superhit Premam, Akkineni Naga Chaitanya working on this project. Now in this film Akkineni Nagarjuna as a chai's father and Venkatesh as a Chai's Uncle.
Please Wait while comments are loading...