»   » నాగార్జున, అఖిల్ కలిసి స్టెప్పేసిన సాంగ్ (మేకింగ్ వీడియో)

నాగార్జున, అఖిల్ కలిసి స్టెప్పేసిన సాంగ్ (మేకింగ్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అఖిల్ మూవీలో ఓ సాంగులో తండ్రి కొడుకులు నాగార్జున, అఖిల్ ఓ సాంగులో కలిసి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగుకు సంబంధించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా అఖిల్ స్పందిస్తూ ‘నాన్నతో కలిసి స్టెప్పులేయడం గొప్ప అనుభూతి, థాంక్సూ డాడ్, ఈ సాంగ్ నాకు ఎంతో స్పెషల్' అని తెలిపారు.

Akhil & Nagarjuna - Song Making

What an experience this was for me! Thank you dad for making the song so special!


Posted by Akhil Akkineni on Sunday, November 15, 2015

వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖిల్' సినిమా తొలి రోజు రూ. 10 కోట్ల షేర్ సాధించింది. ఈ సినిమా కోసం అఖిల్ తన శక్తిమేర కష్టపడ్డాడు. అలని కష్టం అంతా తెరపై స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా డాన్సులు, ఫైట్స్ విషయంలో ఇరగదీసాడు.


ఇన్నాళ్లు షూటింగులతో విరామం లేకుండా గడిపిన అఖిల్ సినిమా విడుదలై పాజిటివ్ రిజల్ట్స్ సొంతం చేసుకోవడంతో రిలాక్స్ అయ్యేందుకు ప్లాన్ చేసాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి గోవా వెళ్లాడు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలంతా షూటింగులు ముగిసన అనంతరం వెకేషన్ వెళ్లడం చూస్తూనే ఉన్నాం. అఖిల్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు.


తొలి సినిమాతోనే అఖిల్ అందరినీ ఆకట్టుకున్నాడు. డాన్సింగ్ స్కిల్స్, అదిరిపోయే యాక్షన్ స్టంట్స్, ఆకట్టుకునే లుక్స్ తో సూపర్బ్ అనిపించాడు. అఖిల్ భవిష్యత్తులో స్టార్ హీరోగా ఎదుగుతాడని అంటున్నారంతా. క డెబ్యూ హీరోకు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం తెలుగులో ఇదే తొలిసారి. ఈ విషయంలో అఖిల్ అక్కినేని టాప్ పొజిషన్లో ఉన్నాడని చెప్పొచ్చు.


శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ‘అఖిల్' చిత్రాన్ని నిర్మించారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.'

English summary
Nagarjuna-Akhil song making video released. "What an experience this was for me! Thank you dad for making the song so special!" Akhil said.
Please Wait while comments are loading...