నాగార్జున ఓ మెంటల్ అట.. సమంత అలా కాదట..
ఓం నమో వెంకటేశాయ చిత్రం తర్వాత తాను నటిస్తున్న చిత్రం రాజు గారి గది 2 అని నాగార్జున తెలిపారు. ఆ చిత్రంలో తాను మెంటలిస్ట్‌గా నటిస్తున్నట్టు వివరించారు.
విభిన్నమైన చిత్రాల ఎంపికలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అక్కినేని ప్రత్యేకమైన శైలి. తాజాగా ఆయన నటించిన ఓం నమో వెంకటేశాయ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటూ భారీ కలెక్షన్లను వసూలు చేస్తున్నది. ఈ చిత్రం తర్వాత ఏంటనే ప్రశ్నకు నాగార్జున తెరదించాడు. తన తదుపరి చిత్రం రాజు గారి గది 2 అని తెలిపాడు. ఓం నమో వెంకటేశాయ చిత్రంలో వేంకటేశ్వరస్వామికి భక్తుడి పాత్రలో కనిపించిన ఆయన ఈ చిత్రంలో మెంటలిస్ట్‌గా నటిస్తున్నానని పేర్కొన్నారు.

రోల్‌ను బాగా డిజైన్ చేశారు.. ఫ్యాన్స్‌కు పండగే
మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడులో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో కలిసి నాగార్జున గురువారం తళుక్కున మెరిశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజు గారి గది2లో తన పాత్ర చక్కగా డిజైన్ చేశారు. ఫ్యాన్స్ చక్కటి విందు లాంటి చిత్రంగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో సరికొత్త అవతారంలో కనిపిస్తాను.

అతిథి పాత్ర కాదు.. ఫుల్ లెంగ్త్
రాజుగారి గదిలో తన రోల్ అతిథి పాత్ర కాదని నాగార్జున వివరణ ఇచ్చారు. తనది పూర్తిస్థాయి పాత్ర అని ఆయన అన్నారు. ఈ చిత్రం 2015లో విడుదలైన రాజు గారి గది సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్నది. ఈ చిత్రానికి కూడా ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీరత్ కపూర్, సమంత, శకలక శంకర్ తదితరులు ఉన్నారు.

సమంత, నాగార్జున జంటగా..
రాజు గారి గది 2 చిత్రంలో నాగార్జున, సమంత జంటగా నటించడంలేదట. ఆమెది ప్రత్యేకమైన పాత్ర అని తెలిసింది. ఈ చిత్రంలో సమంత భూతంగా కనిపించనున్నదనే రూమర్లను చిత్ర నిర్మాతలు కొట్టిపడేశారు. సమంత ఓ భావోద్వేగభరితమైన పాత్రను పోషిస్తున్నది అని సినీ వర్గాలు తెలిపాయి.

మార్చి నుంచి నాగ్ రెగ్యులర్‌గా షూటింగ్
మార్చి నెల నుంచి నాగార్జున రెగ్యులర్‌గా షూటింగ్‌లో పాల్గొననున్నారు. పీవీపీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం ఎస్‌ఎస్ థమన్ అందిస్తున్నారు. 2015లో ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన రాజుగారి గది భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











