»   » తొలిసారి రాయలసీమ యాసలో నాగార్జున డైలాగ్స్

తొలిసారి రాయలసీమ యాసలో నాగార్జున డైలాగ్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్న కింగ్ చిత్రంలో తెలంగాణా స్లాంగ్ లో మాట్లాడి అలరించిన నాగార్జున తాజాగా రాయలసీమ మాండలీకంలో మాట్లాడటానికి సమాయుత్తమవుతున్నట్లు సమాచారం. బిందాస్ చిత్రంతో దర్శకుడుగా మారిన వీరూ పోట్ల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నాగార్జున ఈ శ్లాంగ్ తో రాసిన డైలాగులు చెప్పబోతున్నారు. ఇక ఈ చిత్రం ఓ మాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఈ విషయం గురించి నాగార్జున స్వయంగా చెపుతూ...ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతాం. అలాగే తొలిసారిగా రాయలసీమ శ్లాంగ్ ని ఈ చిత్రంలో నేను మాట్లాడబోతున్నాను. ఇక ఈ చిత్రాన్ని కామాక్షి మూవీస్ బ్యానర్ పై డి శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అనుష్క, ప్రియమణి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇక గతంలో నాగార్జున సంతోషం చిత్రానికి వీరుపోట్ల మూల కథ అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. అలాగే వీరూ పోట్ల గతంలో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలకు కథను, సంతోషం, మనసంతా నువ్వే చిత్రానికి మూల కథను అందించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu