twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాఘవేంద్రరావు బాధపడి కన్నీళ్లు పెట్టుకున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్: "ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. సాయి గెటప్ తీసేసినప్పుడు అందరి కంటే ఎక్కువ బాధపడింది రాఘవేంద్రరావు గారు. పదిహేను రోజులు గడ్డం తియ్యనివ్వలేదు. తీసిన రోజు కన్నీళ్లు పెట్టుకున్నారు. గడ్డం తీసేసిన రోజు రాత్రి పదకొండు గంటలకి ఫోన్ చేసి 'గడ్డం తీసేశావా?' అని బాధపడ్డారు. అంతగా ఆ సినిమాలో ఆయన ఇన్‌వాల్వ్ అయిపోయారు" అంటున్నారు నాగార్జున. 'శిరిడిసాయి'గా నాగార్జున నటించిన చిత్రం సెప్టెంబర్ 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. "నాకున్నది ఒకటే టెన్షన్. 'శిరిడిసాయి' లక్షలాది, కోట్లాది మంది భక్తులున్నారు. ఆయన్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. మనమేమన్నా తప్పు చేస్తున్నామా, మనల్ని వాళ్లు ఒప్పుకుంటారా? అనేదే ఆ టెన్షన్. ఇప్పుడు కూడా భయం గానే ఉంది, ఎక్కడైనా తప్పు చేశామా" అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు.

    "అలాగే రాఘవేంద్రరావు గారు నాతో ఇంక సోషల్ సినిమా తియ్యలేరేమో. మా కాంబినేషన్ అంటే ఈ తరహా సినిమాలే ఊహిస్తారు ప్రేక్షకులు. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' తర్వాత కేరక్టర్లు ఇంకేం లేవనుకున్నాం. మైండ్‌లో ఏమీ లేవు. కేరక్టర్లు వెతకాలి అనుకున్నాం. 'శిరిడిసాయి' వచ్చింది. 'శిరిడిసాయి'చెయ్యడం చక్కటి అనుభవం. రాఘవేంద్రరావుగారు, నేను కలిసి చేసిన 'అన్నమయ్య', 'శ్రీరామదాసు'ను జనం బాగా ఆదరించారు. ఆ పాత్రల్లో నన్ను అంగీకరించారు. 'శిరిడిసాయి' సినిమా చెయ్యడం పెద్ద కష్టమేమీ కాదు. చాలా సింపుల్. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వయసు వారైనా సులువుగా చేరే దేవుడు సాయి. అందరినీ ప్రేమించు అనే ఆయన తత్వం బాగా నచ్చింది" అన్నారు.

    "నాకు రాఘవేంద్రరావు గారున్నారు, ఆయనే చూసుకుంటారని నమ్మాను కాబట్టే చూడలేదు. సెట్స్ మీద మొదటి రెండు మూడు రోజుల్లో ఏం చేస్తున్నామనేది కీలకం. అది చెయ్యగలిగితే కేరక్టర్‌లోకి హాయిగా వెళ్లిపోవచ్చు. మనోజ్‌కుమార్, విజయ్‌చందర్ గార్లు తమవైన సొంత మేనరిజమ్స్‌తో ఆ పాత్రను చేశారు. నా బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు, నా మేనరిజమ్‌తో సాయి పాత్ర చేశా. అందువల్ల ఈ పాత్ర చేయడంలో నాపై ఎవరి ప్రభావమూ లేదు. మీకు తెలుసు, తొంభై ఏళ్ల వయసులోనూ నాన్నగారు వంగిపోకుండా బాగానే నడుస్తున్నారు. నాకు తెలిసి సాయిబాబా పూర్తి ఆరోగ్యవంతులు. ఆయనకి వణుకుతూ, వంగిపోయి నడవాల్సిన అవసరం లేదు. ఆయన వయసే ఎవరికీ తెలీదు. నా కళ్లల్లో ఆయన్ని ఆరోగ్యవంతుడిగానే చూశాను. ఆయన వంగిపోయి లేరు" అని చెప్పారు.

    "ఇక ఈ సినిమాని నిర్మించిన వాళ్లు కానీ, విడుదల చేస్తున్న వాళ్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ అందరూ సాయి భక్తులే. సినిమా అమ్ముడు పోయిన తర్వాత కూడా తమకివ్వాలంటూ ఇంకా వస్తున్నారు. 'వాళ్లని మేం కన్విన్స్ చేసుకుంటాం. మాకివ్వండి' అని అడుగుతున్నారు. నా ఇరవై ఐదేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ ఇలా జరగలేదు. నా దృష్టిలో ఇది 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' మాదిరిగా భక్తి సినిమా కాదు. అవి రెండూ పరమ భక్తుల సినిమాలు. ఇది అలాంటి సినిమా కాదు. సాయి గురించి, సాయి తత్వాన్ని తెలిపే సినిమా" అన్నారు.

    English summary
    Nagarjuna's 'Shirdi Sai' is getting released on 6th September. Nag is playing the title role in this devotional flick and K.Raghavendra Rao is directing it. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X