»   » నాగార్జున-కార్తి మల్టీస్టారర్ టైటిల్ ఖరారైంది

నాగార్జున-కార్తి మల్టీస్టారర్ టైటిల్ ఖరారైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కింగ్ నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్లో పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్, ‘బృందావనం', ‘ఎవడు' చిత్రాల యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ కి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ యూరఫ్ లో ఇటీవలే పూర్తయింది. ఈ సినిమాలో హీరోయిన్ అనుష్క కూడా ఓ ముఖ్య పాత్ర(గెస్ట్ రోల్) లో కనిపించబోతోందట. త్వరలోనే అనుష్క షూటింగులో జాయినవుతుందని తెలుస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ‘ఊపిరి' అనే టైటిల్ ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలుగు, తమిళంలో ఈచిత్రం తెరకెక్కుతోంది. రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

Nagarjuna-Karthi film title Oopiri

తెలుగు, తమిళ భాసల్లో రూపొందుతున్న ఈ మూవీ చాలా బాగా వస్తోంది. వంశీ పైడిపల్లి సినిమాని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు. నా కెరీర్ లో ఇది చాలా డిఫరెంట్ కమర్షియల్ మూవీ అవుతుంది. పివిపి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చాలా లావిష్ గా నిర్మిస్తున్నారు అని నాగార్జున ఆ మధ్య ఓ ప్రెస్ మీట్లో వెల్లడించారు.

తెలుగులో ఫస్ట్ టైమ్ చేస్తున్న స్ట్రైట్ మూవీ చాలా భారీ లెవల్ లో నిర్మిస్తున్నారు పివిపిగారు. నాగార్జున లాంటి పెద్ద స్టార్ తో కలిసి ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది అని కార్తి ఆనందం వ్యక్తం చేసారు. సౌత్ ఈస్ట్ యూరఫ్ లో పెద్ద సిటీ అయిన బెల్ గ్రేడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న మొదటి సౌత్ ఇండియన్ మూవీ ఇదే కావడం విశేషం.

English summary
Film Nagar source informed that Anushka will soon join the unit to shoot for her cameo role in much awaited multi-starrer which has Nagarjuna and Karthi in the lead roles. The makers are contemplating to title the film as Oopiri. Official announcement regarding the title will be made very soon.
Please Wait while comments are loading...