»   » ఖరారు:నాగార్జున, కార్తి చిత్రం ఫస్ట్ లుక్ డేట్

ఖరారు:నాగార్జున, కార్తి చిత్రం ఫస్ట్ లుక్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్లో పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్, ‘బృందావనం', ‘ఎవడు' చిత్రాల యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ కి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ యూరఫ్ లో ఇటీవలే పూర్తయింది. ఈ సినిమాలో హీరోయిన్ అనుష్క కూడా ఓ ముఖ్య పాత్ర(గెస్ట్ రోల్) లో కనిపించబోతోందట. త్వరలోనే అనుష్క షూటింగులో జాయినవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని సెప్టెంబర్ 18న విడుదల చేయటానికి నిర్మాతలు ప్లాన్ చేసారు. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియచేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ‘ఊపిరి' అనే టైటిల్ ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలుగు, తమిళంలో ఈచిత్రం తెరకెక్కుతోంది. రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

ఇక ఈ చిత్రం కథ ఓ ఫ్రెంచ్ సూపర్ హిట్ ఆధారంగా రూపొందిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. 2011 లో వచ్చిన The Intouchables ఆధారంగా ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఒకరు సీనియర్,మరొకరు జూనియర్. ఈ చిత్రం ఫన్ తో కూడిన డ్రామా గా నడుస్తుంది. అయితే ఈ విషయం నిజమా కాదా అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. ఇక ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని పి.వి.పి సంస్ధ తీసుకుందని మరో వార్త వినపడుతోంది. అదే నిజమైతే అఫీషియల్ రీమేక్ గా చెప్పుకోవాలి. ఇప్పటివరకూ ఈ విషయమై అదికారికంగా ఏ సమాచారమూ లేదు.

Nagarjuna,karthi movie first look date

ఇక ఈ చిత్రం కోసం ఇంతకు ముందు నాగార్జున, జూ.ఎన్టీఆర్‌ కలిసి నటిస్తారని ప్రచారం జరిగింది. చివరికి కార్తీని ఎంపికచేశారు. నాగార్జునకు, కార్తీకి రెండు భాషల్లో మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. బృందావనం, ఎవడు వంటి హిట్‌ చిత్రాలు అందించిన వంశీ పైడిపల్లి ఇద్దరి హీరోలకు కథ చెప్పి అంగీకరించపజేశారు. కొత్త చిత్రానికి సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక కార్తీని సీన్ లోకి తీసుకురావటం వెనక కూడా ఓ స్టాటజీ ఉందంటున్నారు. ఓ తెలుగు సూపర్‌స్టార్‌, ఓ తమిళ సూపర్‌స్టార్‌ ఒకే సినిమాలో ఒకే ఫ్రేములో కనిపిస్తే ఎలా ఉంటుంది..ఖచ్చితంగా భాక్సాఫీస్ వద్ద కన్నుల పండువగానూ ఉంటుందని అంటున్నారు. అందులోనూ కూల్ కామెడీని డీల్ చేయటంలో కార్తీ తీరే వేరు. అది ప్లస్ అయ్యి...బాక్సాఫీస్‌ వసూళ్లు కూడా అదిరిపోతాయి. దాంతో తెలుగు, తమిళ్‌ రెండు మార్కెట్లన గుప్పిట్లోకి తెచ్చుకున్నట్టే. సరిగ్గా అలాంటి ప్రణాళికనే వేసింది పివిపి సంస్థ.

అక్కినేని నాగార్జున, కార్తీ కలయికలో పివిపి సినిమాస్‌ ఈ భారీ మల్టీస్టారర్‌ ని నిర్మిస్తోంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. అత్యున్నత సాంకేతిక విలువలతో, రాజీ లేకుండా తెరకెక్కించడానికి పివిపి సంస్థ సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఇతర వివరాల్ని వెల్లడించనున్నారు. ‘మనం' చిత్రంతో నాగార్జున, ‘మద్రాసు' చిత్రంతో కార్తీ విజయాలు సొంతం చేసుకుని చాలా హుషారులో ఉన్నారు కాబట్టి మార్కెట్‌ పరంగా రెండుచోట్లా భారీ క్రేజు ఏర్పడుతుందని అంతా అంచనాలు వేస్తున్నారు.

ఇక తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ భారి బడ్జెట్ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను సెలెక్ట్ చేశారనేది టాక్. ఈ సినిమాలో నాగార్జున, కార్తి ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తారని సమాచారం.

English summary
PVP Cinema ‏ tweeted: "Our next film, starring Karthi & iamnagarjuna, will release its first look & title on Sept 18th. #LetsCelebrateLife "
Please Wait while comments are loading...