twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున తాజా చిత్రం ‘రగడ’ కథేంటి?

    By Srikanya
    |

    వీరూ పోట్ల దర్శకత్వంలో డి.శివప్రసాద్ ‌రెడ్డి నిర్మించిన 'రగడ" చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం కథ విషయానకి వస్తే...కడప మార్కెట్ యార్డులో ఒక చిన్న కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం చేసిన వాడిపై ప్రతీకారం తీర్చుకోవటమే చిత్ర కథాంశం. హీరోకి, విలన్‌కీ మధ్య, ఇద్దరు భామామణుల మధ్య 'రగడ"ను ఆసక్తికరంగా దర్శకుడు మలిచాడు. బ్రహ్మానందం ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. నాగార్జున వెంట అనుష్క పడితే, అనుష్కను బ్రహ్మానందం ఫాలో అవుతుంటాడు - ముక్కోణపు ప్రేమ అన్నమాట. మా మధ్య వచ్చే సన్నివేశాలన్నీ కడుపుబ్బ నవ్విస్తాయి. ఈ చిత్రం కోసం తొలిసారిగా నాగార్జున రాయలసీమ యాసలో మాట్లాడారు.

    ఇక ఈ చిత్రంలో నాగార్జున..'నాది..కడప. నచ్చితే చెరుగ్గడ. నచ్చకపోతే రగడ' అని చెప్పే డైలాగు హైలెట్ అవుతుందంటున్నారు. సంభాషణలు పలికే తీరు కొత్తగా ఉంటుంది. అలాగే ఈ చిత్రం గురించి..."నాకు సినిమా మీద గట్టి నమ్మకం. సినిమాల్లోకి వచ్చి ఇరవై ఐదేళ్లు అవుతోంది. ఈ మధ్యకాలంలో హిట్టు కొట్టలేదనే బాధ, ఉక్రోషంలోంచి 'రగడ' పుట్టుకొచ్చింది. 'రగడ' అంటే ఏమిటో ఆంధ్రదేశానికంతా తెలుస్తుంది. రగడ టైటిల్ ‌కు తగ్గట్టుగా వసూళ్లపరంగా రగడ సృష్టిస్తుందీ సినిమా అంటూ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన అనూష్క, ప్రియమణి నటించారు. ఎంట్రన్స్ ‌లో వచ్చే ఫైట్, ఛార్మి ఐటెం సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X