»   » 'ఏ మాయ చేసావే' సినిమా కోసం ఇతరులని కష్టపెడుతున్న నాగ్, మంజుల..!!

'ఏ మాయ చేసావే' సినిమా కోసం ఇతరులని కష్టపెడుతున్న నాగ్, మంజుల..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున పుత్రరత్నం నాగచైతన్య తొలి చిత్రంతో నెగిటివ్ మార్కులు తెచ్చుకోవడంతో తన రెండవ సినిమా 'ఏ మాయ చేసావె'ను ఎలాగయినా హిట్ చేయించాలని నాగార్జున తెగ ఆరాట పడుతున్నాడు. చైతన్య తొలి సినిమా జోష్ విడుదలకు ముందు రోజున నిద్రలేని రాత్రులు గడిపిన నాగార్జున తన పుత్రుడు కోసం 'కేడీ' సినిమా నిర్మాత, తన మిత్రుడు శివప్రసాద్ రెడ్డికి నిద్రలేకుండా చేస్తున్నాడు. చైతన్య సినిమా ప్రమోషన్ నిమిత్తం మీడియాతో మాట్లాడిన నాగార్జున కేడీ సినిమా తనని తీవ్ర నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించారు. దీంతో అసలు ఆ దర్శకుడిని, కథానాయికని తీసుకొమ్మని తనే సూచించి ఆ తర్వాత ఇప్పుడు తన సుపుత్రుడి కోసం సినిమా నిరాశ పరిచింది అని వ్యాఖ్యానించడం, అదీ సినిమా విడుదలయి నెల కూడా కాకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అసలే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న నా సినిమాని ఎవరు చూస్తారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షాత్తు సినిమా హీరోనే సినిమా బాగాలేదని సర్టిఫై చేస్తే ఇక బాక్సులు తిరుగు ప్రయానం పట్టడం ఖాయమని, ఎంత తన కొడుకయినా ఇంకొకరికి నష్టం కలిగేలా మాట్లాడటం భావ్యం కాదని సినీ పరిశ్రమలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈయన గారి ఓవరాక్షన్ అటుంచితే 'ఏ మాయ చేసావె' సినిమా నిర్మాత, స్వతహాగా గొప్పలు చెప్పుకోవడం అలవాటయిన మంజుల గారు ఎన్నాళ్లని ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, రెండు కామెడీ సీన్లు వుండే సినిమాలను చూస్తారు, 'మనిషన్నాకా కూసింత కళాపోషన వుండాలి' అని రావుగోపాల్ రావు గారి డైలాగును వెరయిటీగా చెప్పింది. మా సినిమా ఖచ్చితంగా వైవిధ్యంగా వుంటుంది తప్పక అలరిస్తుంది. ఇదేదో అన్ని సినిమాల్లా సాధారణ చిత్రం కాదు మంచి ఫీల్ వున్న చిత్రం అంటూ లెక్షర్ దంచేసింది.

తమ సినిమాను ప్రమోట్ చేసుకోవచ్చుకానీ ఇతరుల చిత్రాలను చెత్త చిత్రాలని అర్థం వచ్చేలా మాట్లాడేందుకు ఆమెకు ఏం అర్హత వుంటుంది. ఇలాంటి సమయంలో సినిమా హిట్ అయితే పర్లేదు కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం మంజుల బోల్డన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి... మనం మాత్రం సినిమా మంచి విడయం సాధించి తెలుగు సినీ పరిశ్రమ చల్లగా వుండాలని ఆశిద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu