»   » రంగస్థలంపై ప్రశంసలు కురిపించిన నాగార్జున.. థాంక్యూ మామ అంటూ సమంత రిప్లై!

రంగస్థలంపై ప్రశంసలు కురిపించిన నాగార్జున.. థాంక్యూ మామ అంటూ సమంత రిప్లై!

Subscribe to Filmibeat Telugu

రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ప్రముఖుల మన్ననలు అందుకుంటోంది. టాలీవుడ్ సెలెబ్రిటీలు ఇప్పటికే రంగస్థలం చిత్రంపై ప్రశంసలు కురిపించారు. మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి బిగ్ సెలెబ్రిటీలంతా రంగస్థలంలో రాంచరణ్, సమంత అద్భుత నటనకు అభినందనలు తెలియజేసారు. ఆ జాబితాలోకి తాజగా కింగ్ నాగార్జున కూడా చేరారు. రంగస్థలం చిత్రం చూసాక నాగార్జున ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

రంగస్థలం చిత్రంలో రాంచరణ్ నటన అద్భుతంగా ఉందని నాగార్జున ప్రశంసించారు. రాంచరణ్ చిట్టిబాబు పాత్రలో జీవించాడని కితాబిచ్చాడు. అదేవిధంగా కోడలు సమంత నటన గురించి కూడా నాగార్జున మాట్లాడారు. సమంత గర్వపడేలా నటించిందని నాగార్జున అన్నారు. ఇక దర్శకుడు రంగస్థలం చిత్రాన్ని అందంగా అద్భుతంగా చిత్రికరించారని నాగార్జున ప్రశంసించారు. పల్లెటూరి వాతావరణంతో కొన్నేళ్లు వెనక్కి తీసుకుని వెళ్లి మన మూలాల్ని మనకు తెలియజేసారని సుకుమార్ ని అభినందించారు.

మావయ్య నుంచి ప్రశంసలు దక్కడంతో సమంత వెంటనే ప్రతిస్పందించింది. థాంక్యూ మామా అంటూ ట్విట్టర్ లో రిప్లై ఇవ్వడం విశేషం. రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతూ జైత్ర యాత్రని కొనసాగిస్తోంది. చరణ్ కెరీర్ లో రంగస్థలం చిత్రం బిగ్గెస్ట్ హిట్.

English summary
Nagarjuna praises Rangasthalam movie team. Samantha thanks his father in law
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X