»   »  ప్రీక్వెల్ ప్లానింగ్ లో నాగార్జున

ప్రీక్వెల్ ప్లానింగ్ లో నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఒక సినిమా ఘన విజయం సాధిస్తే దాని కొనసాగింపుగా సీక్వెల్ తీయటం ఆనవాయితీ. హాలీవుడ్ లో అయితే ఆ కథకు ముందు ఏం జరిగిందనే ప్రీక్వెల్స్ కూడా ప్లాన్ చేస్తూంటారు. ఒక్కోసారి అవీ హిట్టై డబ్బు చేసుకుంటాయి. ఇప్పుడు నాగార్జున అలాంటి ప్రయోగమే చేయబోతున్నట్లు సమాచారం.

ఈ సంక్రాంతికి ‘సోగ్గాడు..'గా వచ్చి హిట్ కొట్టిన నాగార్జున ఉషారుగా ఉన్నారు. ఆ చిత్రంలో బంగార్రాజుగా నాగార్జున నటన, స్టైల్‌... ఫ్యాన్స్ కు పిచ్చెక్కించేసాయి. దాదాపు రూ.40 కోట్ల వసూలు సాధించి నాగార్జున కెరీర్‌లోనే బెస్ట్ ఫిలింగా నిలిచింది.

Nagarjuna registers Bangarrarju title

దాంతో ‘సోగ్గాడే చిన్నినాయన' కథకు సీక్వెల్ ప్లాన్ చేయాలని నాగార్జున అనుకున్నారు. అది దర్శకుడుతో చర్చిస్తే...సీక్వెల్ కన్నా ప్రీ క్వెల్ అయితే వర్కువుట్ అవుతుందని సలహా ఇచ్చాడట. దాంతో ప్రొసీడ్ అని నాగార్జనన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దాంతో వెంటనే ఇప్పుడు ‘బంగార్రాజు' టైటిల్‌ని ఫిల్మ్‌ఛాంబర్‌లో నమోదు చేయించారని సమాచారం.

ప్రీక్వెల్ లో ఏముంటుంది...

‘సోగ్గాడే...' కథలో బంగార్రాజు, రాము పాత్రల్లో కనిపించారు నాగ్‌. బంగార్రాజు మరణించిన తరవాత ఆత్మ రూపంలో భూమ్మీదకు వచ్చిన తరవాత ఏం జరిగింది? అనే విషయాన్ని చూపించారు. దానికి ముందు జరిగిన కథేంటి? అన్నది ‘బంగార్రాజు'లో అంటే సోగ్గాడు ప్రీక్వెల్ లో చూడొచ్చని తెలుస్తోంది. ఈ చిత్రానికీ కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. అన్నపూర్ణ బ్యానరై చిత్రం నిర్మిస్తారు.

English summary
Nagarjuna is ready with Bangarrajutitle and has registered it under his Annapurna Banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu