twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫీల్, ఫన్ ...('మనం' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : అక్కినేని కుటుంబ చిత్రం ఈ రోజు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ మధ్యకాలంలో వరస ఫ్లాపులతో ముందుకు వెళ్తున్న నాగార్జున ఈ చిత్రం హిట్ తో ఊపిరిపీల్చుకోవాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. విభిన్నమైన ప్రోమోలు ఇప్పటికే ఈ చిత్రానికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఫీల్, ఫన్ కలగలిసిన ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. అక్కినేని చివరి చిత్రం కావటం కూడా ఎమోషనల్ గా ఈ చిత్రం ఆయన అభిమానులకు గిప్ట్ గా భావిస్తున్నారు. అందరి అంచనాలకు తగ్గట్లే రిచ్ గా తీసిన ఈ చిత్రం కథ గమ్మత్తుగా ఉండబోతోంది. ఈ చిత్రం 1920 నుంచి 2030 మధ్య వంద సంవత్సరాలలో జరిగిన కథగా తెరకెక్కింది.

    సినిమాలో... అక్కినేని నాగేశ్వరరావుగారి పాత్ర పేరు చైతన్య, నాగార్జున పాత్ర పేరు నాగేశ్వరరావు, నాగ చైతన్య పాత్ర పేరు నాగార్జున. ఇలా ఒకరి పేర్లు మరొకరికి మార్చి పెట్టడంలోనే సగం సక్సెస్ సాధించారనే చెప్పాలి. కాలంతోపాటు పద్ధతులు, నాగరికత వల్ల అలవాట్లు మారతాయేమో కానీ ప్రేమ మారదు. నిన్న, నేడు, రేపు.. ఎప్పుడైనా సరే. ప్రేమ ప్రేమే. అదే మా 'మనం' సారం .

    కథగా చెప్పాలంటే... సినిమా ప్రారంభం రాధామోహన్ (నాగచైతన్య), కృష్ణవేణి(సమంత) వివాహం...అయితే వీరికి ఓ బిడ్డ బిట్టు పుట్టిన తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోవాలనుకుంటారు. అయితే అది రాధామోహన్ కి ఇష్టం ఉండదు. ఈ లోగా ఊహించని పరిణామాల్లో ఈ జంట మరణిస్తారు. కొంత కాలం తర్వాత పెద్ద పారిశ్రామిక వేత్త నాగేశ్వరరావు(నాగార్జున) కి నాగార్జున(నాగ చైతన్య), ప్రియ(సమంత) కలుస్తారు. వీరిద్దరని కలపాలని నాగేశ్వరరావు(నాగార్జున) కలపాలనుకుంటాడు. ఈ లోగా...చైతన్య(ఎఎన్నార్) ఎంట్రీ. చైతన్య కి చేసిన సహాయంతో నాగేశ్వరరావు(నాగార్జున)...అంజలి(శ్రియ) తో ప్రేమలో పడతారు. అప్పుడు చైతన్య(ఎఎన్నార్) వీళ్లద్దరినీ కలపాలని ప్లాన్ చేస్తాడు. చివరకు ఏమైంది. ఈ ప్రేమ కథలు ఎలా ఓ కొలిక్కి వచ్చాయి...ఎఎన్నార్ క్యారెక్టర్ ఏంటి అనేది తెరమీద చూడాల్సిందే.

    Nagarjuna's Manam movie preview

    దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ...'నాగేశ్వరరావు గారు, నాగార్జునగారు, నాగచైతన్య కలిసి నటించే చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దలు నాగేశ్వరరావుగారి ఆశీస్సులతో ఈచిత్రాన్ని చేస్తున్నాను. ఫస్ట్ లుక్ గెటప్స్ డిఫరెంటుగా ఉన్నట్లుగానే సినిమా కూడా చాలా డిఫరెంటుగా ఉంటుంది' అన్నారు. వందశాతం కామెడీతో మంచి లవ్ ఫీల్‌తో మంచి ఎమోషనల్‌తో 'మనం' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. నాగేశ్వరరావుగారొక లెజెంట్. లెజెండ్ తో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చారు దర్శకుడు.

    నాగార్జున మాట్లాడుతూ... ఇప్పటికే 'మనం' చిత్రం వీక్షించానని, అద్బుతంగా రూపొందించబడిందన్నారు. ఈ చిత్రంలో తమ ముగ్గురి మధ్య సరదా సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. సినిమా వినోదం పండిస్తుందనీ, చక్కని మ్యూజిక్ కుడా ఉందనీ అన్నారు. ఇందులో నాన్న నటన చిరస్మరణీయంగా నిలుస్తుందన్నారు. సినిమాలో నటిస్తూనే పరమపదించడంతో ఆయన చిరకాల కోరిక నెరవేరిందన్నారు.

    నటీనటులు : అక్కినేని,నాగార్జున, చైతన్య , సమంత, శ్రెయ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే తదితరులు.

    మాటలు : హర్షవర్ధన్,
    పాటలు : చంద్రబోస్, వనమాలి,
    డాన్స్ : బృంద,
    ఫైట్స్ : విజయ్,
    కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్,
    ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్,
    సంగీతం : అనూప్ రూబెన్స్,
    ఆర్ట్ :రాజీవన్,
    ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి,
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ,
    నిర్మాత : నాగార్జున అక్కినేని,
    కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

    English summary
    'Manam' movie is the perfect send-off for Legendary Akkineni. Watch out this space for our review .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X