»   » ఉషారు వచ్చింది..'ఊపిరి' ఆడియో డేట్ ఇచ్చారు

ఉషారు వచ్చింది..'ఊపిరి' ఆడియో డేట్ ఇచ్చారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమ సినిమాలో చేస్తున్న హీరో హిట్ కొడితే ఆ నిర్మాతలకు వచ్చే ఆనందమే వేరు. ఎందుకంటే ఆ హిట్ ప్రభావంతో తమ చిత్రాలకు బిజినెస్ అవుతుంది. నాగార్జున రీసెంట్ గా సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయన' తో సూపర్ హిట్ ఇచ్చారు. దాంతో నాగార్జునతో ఊపిరి చిత్రం చేస్తున్న నిర్మాతలు ఊపరి పీల్చుకున్నారు. వెంటనే ఈ వేడిలోనే సినిమాని రిలీజ్ చేసేయాలనుకున్నారు. అందులో భాగంగా... గోపిసుందర్ స్వరపరిచిన పాటలు ఫిబ్రవరి 28న విడుదల చేస్తున్నారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అనుష్క, శ్రేయ, అడవి శేష్ కీలక పాత్రల్లో కనపడనున్నారు. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చ్ 25న విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.


Nagarjuna's next movie Oopiri songs on

నాగార్జున మాట్లాడుతూ... ''ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ వినలేదు. వంశీ కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యా. మల్టీస్టారర్‌చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంద''న్నారు.


''నా సినిమాలన్నీ తెలుగులో అనువాద రూపంలో విడుదలయ్యాయి. తెలుగులో నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇది. నాగార్జునగారితో తెర పంచుకోవడం ఆనందంగా ఉంద''ని కార్తి తెలిపారు.


Nagarjuna's next movie Oopiri songs on

''నాగార్జున, కార్తి ఈ సినిమా చేస్తామని ముందుకు రావడంతో సగం విజయం సాధించినంత ఆనందంగా ఉంది. నేను రాసుకొన్న పాత్రలకు వాళ్లయితేనే పూర్తిగా న్యాయం చేస్తారనిపించింద''న్నారు వంశీ పైడిపల్లి.


హాలీవుడ్‌కు చెందిన 'ది ఇంటచబుల్స్' సినిమాకు రీమేక్‌గా తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్‌, ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: శ్రీకర ప్రసాద్‌.

English summary
Nagarjuna, Karthi's multi starrer Oopiri makers revealed that the film's audio will be released on Feb 28th in style.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu