చిన్న పదాలకు కూడా గూగుల్ సెర్చ్, ఎంజాయ్ చేశా: నాగార్జున
హైదరాబాద్: సోగ్గాడే చిన్న నాయన చిత్రంలోని రాము పాత్రను తాను చాలా ఎంజాయ్ చేశానని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున అన్నాడు. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాము అనే పాత్రలో చాలా ఎంజాయ్ చేశానని నాగార్జున అన్నారు.
ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో తనయుడి పాత్ర పేరు రాము. దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఈ పాత్రని చాలా భిన్నంగా, ఆసక్తికరంగా రూపొందించారని నాగార్జున అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది.

రాము పాత్ర గురించి నాగార్జున ప్రత్యేకంగా మాట్లాడారు. "సినిమాలో రాము ఒక డాక్టర్. చాలా తెలివైనవాడు. అయితే అతనికి వేషభాషల గురించి ఏ మాత్రం తెలియదు. జుట్టు దువ్వుకోవడం, సరిగా చొక్కా వేసుకోవడం.. ఏవీ తెలియవు" అని చెప్పారు.
"అంతే కాదు చిన్న చిన్న వాడుక పదాలకి కూడా గూగుల్‌లో అర్థాలు అన్వేషిస్తుంటాడని, ఈ పాత్రలో నటించే సమయంలో చాలా ఎంజాయ్ చేశాన"ని నాగార్జున అన్నారు.


Click it and Unblock the Notifications











