»   » చిన్న నాటి ఫొటో పోస్ట్ చేసిన నాగార్జున : భలే ఉన్నాడే

చిన్న నాటి ఫొటో పోస్ట్ చేసిన నాగార్జున : భలే ఉన్నాడే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫాదర్స్ డే ఫేస్ బుక్ సహా సొషల్ మీడియా మొత్తం. నాన్నల ఫొటోలతోనూ, నాన్న మీద కవితలతోనూ నిండిపోయింది. ఇలాంటి ప్రత్యేకమైన రోజు సందర్భంగా సాధారణ వ్యక్తులే కాక, సినీ సెలబ్రిటీలు కూడా తమ ఫాదర్స్‌తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంలో నాగ్ 50 ఏళ్ళ క్రితం నాటి ఫోటో ఒకటి పోస్ట్ చేసి అక్కినేని అభిమానులకు మంచి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

తను ఐదారేళ్ళ వయస్సు ఉన్నప్పుడు తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో ఏఎన్నార్ మోకాళ్లపై కూర్చొని ఉండగా, ఎదురుగా నాగ్‌తో పాటు సోదరి నాగ సుశీల ఉన్నారు. కొన్ని ఏళ్ల క్రితం నాటి ఫోటోని ఎంతో జాగ్రత్తగా దాచుకున్న నాగ్ ఫాదర్స్ డే సందర్భంగా అభిమానులు ముందు ఉంచడంతో ఫ్యాన్స్ హ్యపీగా ఫీలయ్యారు.

Nagarjuna Shares his childhood pic in social media

చైల్డ్ లుక్‌లో నాగ్ చాలా ఫన్నీగా కనిపిస్తునాడు. మొత్తానికి ఫాదర్స్ డే నాడు నాగ్ అక్కినేనిని గుర్తు చేయడంతో పాటు తన చిన్నతనం లుక్ ని చూపించడం అందరిని ఆనందానికి గురి చేసింది.ఇప్పుడు ఇంతందంగా ఉండే నాగార్జున చిన్నప్పుడు మాత్రం ఎంత అమాయకంగా ఉన్నాడో...

English summary
Hero Akkineni Nagarjuna posted his Childhood photo with his father late Akkineni nageshwara rao and his sister Naga Susheela on Fathers Day ...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu