twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ ‘షిరిడి సాయి’ ఆడియో టాక్ ఏంటి?

    By Bojja Kumar
    |

    ఓ వైపు మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు తీస్తూ..మరో వైపు నవ మన్మధుడిలా రొమాంటిక్ సినిమాల్లో రొమాన్స్ పండిస్తూ...ఇంకో వైపు భక్తిరస చిత్రాల్లో నటించి ప్రేక్షకులతో వారెవ్వా అనిపించుకోవడం ఒక్క అక్కినేని నాగార్జునకే దక్కింది. తాజాగా నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం 'షిరిడి సాయి'.

    ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి సంగీతం అందించారు. ఈచిత్రం ఆడియో జులై 30న హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ చిత్రం ఆడియోకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సాయిబాబాను స్థుతిస్తూ కంపోజ్ చేసిన పాటలు అద్భుతంగా ఉన్నాయని, అన్నమయ్య, శ్రీరామదాసు తరహాలో విజయం సాధిస్తాయనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది.

    పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రానికి ఎంఎం కీవవాణి సంగీతం అందించారు. ఇందులోని పాటల్ని సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, శ్రీరామ జోగయ్య శాస్త్రి, వేదవ్యాస్, మేడిచర్ల సత్యనారాయణ మూర్తి తదితరులు వ్రాశారు. మొత్తం 14 పాటలుండగా.... ఎంఎం. కీరవాణి, మధు బాలకృష్ణ, సునీత, అక్కినేని నాగార్జున, శంకర్ మహ దేవన్, శ్వేతా పండిత్, దీపు, అదిథి పాల్, హరిహరన్, మాలవిక, ఎస్పీ బాలు, సోను నిగమ్, తీశనిగం, సాయికుమార్, రేవంత్, రాహుల్, చైత్ర తదితరులు పాడారు.

    ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.గోపాలరెడ్డి, ఎడిటింగ్: శర్వన్, కళ: భాస్కర రాజు, శ్రీకాంత్, కథా సంకల్పం: భక్త సురేష్, కథా సహకారం: పొందూరి హనుమంతరావు, కో డైరెక్టర్: ఎ.ఎస్. రవీంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. విక్రమ్ కుమార్, నిర్మాత: ఎ.మహేష్ రెడ్డి, సమర్పణ: శ్రీమతి సులోచనారెడ్డి, దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

    English summary
    Recently Nagarjuna's 'Shirdi Sai' audio release happened in a conventional style and reports are arriving from the market. It is heard that overall the songs are very good and they will climb slowly in the chart buster list. As such, no comparison can be made with films like ‘Annamayya’ and ‘Sri Ramadasu’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X