For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొడుకులపై నాగార్జున బెంగ: ఇప్పటికీ గట్టిగా కొట్టింది లేదు, లైట్ తీస్కోవద్దని సూచన!

  |

  నిన్నటి తరం తీసుకుంటే తెలుగులో అగ్రహీరోలుగా వెలుగొందిన నలుగురిలో నాగార్జున ఒకరు. ఏఎన్ఆర్ వారసుడిగా తెరంగ్రేటం చేసి అనతికాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మన్మధుడిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను, బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకున్నారు.

  నాగార్జున వారసులుగా తన ఇద్దరు కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారితో పోటీ పడుతూ నాగార్జున సినిమాలు చేస్తున్నారంటే ఆయనకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన కెరీర్ పరంగా నాగార్జునకు ఎలాంటి బెంగలేదు. అయితే ఇద్దరు వారసులు ఇంకా ఇండస్ట్రీలో సరైన ట్రాక్‌లో పడలేదనే బాధ ఆయనలో ఉందట.

   స్టార్ హీరోల లిస్టులో పడని చైతూ

  స్టార్ హీరోల లిస్టులో పడని చైతూ

  నాగ చైతన్య చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలో అడుగు పెట్టినా ఇంకా సరైన ట్రాకులో పడలేదనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. చైతూ కెరీర్లో ‘ఏమాయ చేశావే', ‘మనం' లాంటి హిట్స్‌తో పాటు మరికొన్ని విజయాలు ఉన్నప్పటికీ అవి అతడిని స్టార్ హీరోల జాబితాలో చేర్చలేక పోయాయి అనేది వాస్తవం.

   చైతూ బ్లాక్ బస్టర్ రుచి చూసి చాలా కాలమైంది

  చైతూ బ్లాక్ బస్టర్ రుచి చూసి చాలా కాలమైంది

  నాగ చైతన్య బ్లాక్ బస్టర్ రుచి చూసి చాలా కాలమైంది. ఇటీవల విడుదలైన సవ్యసాచి బాక్సాఫీసు వద్ద నిరుత్సాహ పరచగా, అంతకు ముందు విడుదలైన సినిమాలు కొన్ని మాత్రమే ఓ మోస్తరుగా ఆడాయి.

  కొణిదెల బ్యానర్‌లో అఖిల్.. రాంచరణేనా, ఉత్కంఠ రేపుతున్న క్రేజీ కాంబినేషన్!

  అఖిల్ లాచింగ్ తడబాటు

  అఖిల్ లాచింగ్ తడబాటు

  నాగార్జున రెండో కుమారుడు ‘అఖిల్' తెరంగ్రేటం కూడా సరిగా జరుగలేదు. తొలి సినిమా దారుణమైన ప్లాప్ కాగా.... ‘హలో' సినిమా ద్వారా రీ లాంచ్ చేశారు. ఈ సినిమా హిట్ జాబితాలో పడినప్పటికీ అఖిల్‌కు రావాల్సినంత క్రేజ్ తేవడంలో విఫలమైంది.

  సెట్ చేసేందుకు మన్మధుడి ప్రయత్నాలు

  సెట్ చేసేందుకు మన్మధుడి ప్రయత్నాలు

  ఈ పరిణామాలను లైట్ తీస్కుంటే భవిష్యత్తులో తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనలో పడ్డ మన్మధుడు ఇద్దరు కుమారుల కెరీర్ సెట్ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట.

  తొందర పడొద్దని కొడుకులకు సూచించిన నాగ్

  తొందర పడొద్దని కొడుకులకు సూచించిన నాగ్

  స్క్రిప్టు ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, వాటిని తనకు చూపించే వరకు ఫైనలైజ్ చేయవద్దని ఇద్దరు కుమారులకు నాగార్జున సూచించారట. సినిమా రిలీజ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఫైనల్ ఔట్ పుట్ సంతృప్తికరంగా ఉంటేనే విడుదల చేయాలని, అవసరం అయితే రీషూట్లు, మార్పులకు వెనకాడకూడదని, ఈ విషయాల్లో కఠినంగా లేక పోతే కెరీర్ మీద ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని సూచించాడట.

  కొత్తగా వచ్చి కొడుతూ పోతున్నారు

  కొత్తగా వచ్చి కొడుతూ పోతున్నారు

  ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన కుర్రాళ్లు వరుస విజయాలు కొడుతూ దూసుకెళుతున్నారు. అందుకు కారణం వారు ఎంచుకునే స్క్రిప్టులు. ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా స్క్రిప్టు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ఎవరైనా కెరీర్ విషయంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

  English summary
  Nagarjuna sons Naga Chaitanya and Akhil are still searching for a big break. They still fail to select the correct script. So Nagarjuna has asked them to pick their scripts with care and not hurry to release a film until the final product is perfect.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X