»   »  కన్నుల పండువగా చైతూ, సమంత మ్యారేజ్.. డ్యాన్సులతో నాగ్, వెంకీ హంగామా

కన్నుల పండువగా చైతూ, సమంత మ్యారేజ్.. డ్యాన్సులతో నాగ్, వెంకీ హంగామా

Written By:
Subscribe to Filmibeat Telugu

రెండు రోజుల వివాహంలో భాగంగా క్రిస్టియన్ పద్ధతిలో నాగచైతన్య వివాహం శనివారం సాయంత్రం గోవాలో ఆడంబరంగా జరిగింది. మత గురువు పర్యవేక్షణలో చైతూ, సమంతల వివాహ తంతు ముగిసింది. దీంతో చైతూ, సమంతల వివాహ వేడుక పూర్తయినట్టే. ఆదివారం నూతన వధూవరులతో అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు హైదరాబాద్‌కు చేరుకొనే అవకాశం ఉంది.

నాగచైతన్యను తన జీవితంలోకి

నాగచైతన్యను తన జీవితంలోకి

క్రిస్టియన్ మత పెద్ద సమక్షంలో పుష్ఫగుచ్ఛం అందించి సమంత నాగచైతన్యను తన జీవితంలోకి ఆహ్వానించింది. గోవాలోని ప్రముఖ చర్చిలో జరిగిన ఈ వేడుకకు సమంత, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు, సన్నిహితులు హాజరయ్యారు.

Naga Chaitanya And Samantha Ruth Prabhu Wedding Photos సమంతల పెళ్లి ఫోటోలు..
సమంతకు ఉంగరం తొడిగి

సమంతకు ఉంగరం తొడిగి

వివాహా ప్రార్థనల తర్వాత సమంతకు ఉంగరం తొడిగి ఆమెను నాగచైతన్య తన జీవిత భాగస్వామిగా చేసుకొన్నారు. ఈ కార్యక్రమం నూతన దంపతుల భావోద్వేగాల మధ్య జరుగడం విశేషం.

వేదిక సిద్ధం..

వేదిక సిద్ధం..

ఇదిలా ఉండగా, క్రిస్టియన్ పద్ధతిలో శనివారం సాయంత్రం జరుగనున్న మ్యారేజ్‌కు వేదిక సిద్ధమైంది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన స్టేజ్ ఫోటోను సమంత మీడియాలో షేర్ చేశారు.

వెడ్డింగ్ డ్రెస్‌లో సమంత

వెడ్డింగ్ డ్రెస్‌లో సమంత

క్రిస్టియన్ పద్దతిలో జరిగే పెళ్లి కోసం సమంత అందంగా ముస్తాబయ్యారు. వెడ్డింగ్ గౌన్‌ ధరించి తన స్నేహితురాలితో ఫోటోకు ఫోజిచ్చారు.

డీజే హోరులో నాగ్.. వెంకటేష్

డీజే హోరులో నాగ్.. వెంకటేష్

గోవాలో చైతూ, సమంత వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన పార్టీలో నాగార్జున, వెంకటేష్ డ్యాన్సులతో హోరెత్తించారు. డీజే సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేసి ఆనందంలో మునిగి తేలారు.

పెళ్లిలో అఖిల్, రానా హంగామా

పెళ్లిలో అఖిల్, రానా హంగామా

నాగచైతన్య, సమంత పెళ్లి వేడుక అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలను మరోమారు మరింత దగ్గర చేసింది. గోవాలో అట్టహాసంగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకలో రానా, అఖిల్ హంగామా చేశారు. తన కుమారుడు పెళ్లి వేడుకలో నాగార్జున, మేనల్లుడి వివాహంలో విక్టరీ వెంకటేష్ చేసిన డ్యాన్సులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

రెచ్చిపోయిన వెంకటేష్

రెచ్చిపోయిన వెంకటేష్

సాధారణంగా ఆర్భాటలకు దూరంగా ఉండే వెంకటేష్ తన మేనల్లుడి వివాహంలో రెచ్చిపోయారు. పాటలకు అనుగుణంగా రెచ్చిపోయి స్టెప్పులతో అతిథులను ఉర్రూతలూగించారు.

English summary
The wedding of Naga Chaitanya and Samantha in Goa yesterday was the talk of the town. While the Hindu wedding was held yesterday, the marriage will take place according to Christian traditions today. Only the kith and kin and a few select friends from the industry were in attendance for the event. In this occassion, Nagarjuna, Venkatesh shakes the leg.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu