»   »  సూపర్ హిట్ రీమేక్ లో నాగ్, మోహన్ లాల్ ఒప్పుకుంటాడా?

సూపర్ హిట్ రీమేక్ లో నాగ్, మోహన్ లాల్ ఒప్పుకుంటాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక భాషలో హిట్టైన చిత్రాల రైట్స్ తీసుకుని రీమేక్ చేయటం హీరోలకు కొత్తేమీ కాదు. మినిమం గ్యారెంటీ సినిమాలుగా ఇవి తెరకెక్కి, చాలా సార్లు ఘన విజయం సాధిస్తూంటాయి. ముఖ్యంగా నేటివిటి సమస్య రానప్పుడు జనాల్లోకి ఇవి బాగా దూసుకుపోతాయి. అందుకే దర్శక,నిర్మాతలు, హీరోలు రీమేక్ లు అంటే ఉత్సాహం చూపుతారు.

తాజాగా నాగార్జున ఓ మళయాళి చిత్రం రీమేక్ పై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే మోహన్ లాల్ ఆ రీమేక్ కు ఒప్పుకుంటాడా...ఆయన అడ్డం ఏమిటి అంటారా.... రీసెంట్ గా మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన చిత్రం 'ఒప్పమ్‌'. మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు హక్కుల్ని ఓవర్సీస్‌ నెట్‌ వర్క్‌ సెంటర్‌ సంస్థ చేజిక్కించుకొంది. మోహన్‌లాల్‌తో పాటు బి.దిలీప్‌ కుమార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తారు.

మోహన్‌లాల్‌ పాత్రకు నాగార్జున అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం. నాగ్‌ని సంప్రదించడానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కమల్ తమిళంలో రీమేక్ చేయటానికి ఉత్సాహం చూపిస్తున్న ఈ చిత్రంలో నాగ్ చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు సైతం భావిస్తున్నారు.

దానికి తోడు నాగార్జున తొలినుంచి డిఫెరెంట్ చిత్రాలకు ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. దాంతో విభిన్నంగా సాగే ఈ కథలో నాగ్ నటించటానికి ఉత్సాహం చూపెడతాడని అంటున్నారు. రీసెంట్ గా 'వూపిరి' చిత్రంలో వీల్‌ఛైర్‌కే పరితమైన పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకే నాగ్‌తో ఈపాత్ర చేయించాలని చిత్ర యూనిట్ ఆసక్తి చూపిస్తోందని సమాచారం. నాగ్‌ ఈ ప్రపోజల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాసాలే ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది.

Nagaruja in Mohanlal-starrer Oppam telugu remake?

మోహన్ లాల్ తెలుగులో ఈ సినిమాని రీమేక్ గా కాకుండా డబ్బింగ్ చేసి విడుదల చేయాలని భావిస్తున్నారట. ఆయన తెలుగులో మార్కెట్ ని పెంచుకునే వ్యూహంలో భాగంగా ఈ సక్సెస్ ఫుల్ చిత్రం తెలుగు డబ్బింగ్ అయితే బాగుంటుందని చెప్తున్నారట. దాంతో నాగ్ తో రీమేక్ బాగుంటుంది కానీ మోహన్ లాల్ ఓకే అంటేనే కదా ముందుకు వెళ్లేది.

మోహన్ లాల్ , సముతిరాకని, అనుశ్రీ, విమలారామన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఒప్పం'. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొంది రెండు వారాల క్రితం రిలీజైన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 8న విడుదలైన ఈ చిత్రం మొదటి 15 రోజుల్లోనే 23.7 కోట్లు గ్రాస్ వసూలు చేసి , మళయాళ సూపర్ హిట్ మూవి ప్రేమమ్ రికార్డ్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతోంది. చిత్రం తమిళ రీమేక్ ని కమల్, హిందీలో అక్షయ్ చేయటానికి ఆసక్తిచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ కోసం వెంకటేష్ వంటి హీరోలు,సాయి కొర్రపాటి వంటి స్టార్ నిర్మాతలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అందుకు కారణం మోహన్ లాల్ స్వయంగా తను నటించిన వెర్షన్ తోనే తెలుగులో కనిపించాలనికోవటం. రీమేక్ చేస్తే వేరే హీరోకు ఆ హిట్ ఖాతాలో పడుతుంది. అదే తన డబ్బింగ్ సినిమా ఆడితే, తనకు పేరు , డబ్బు, ఇక్కడ మరిన్ని ఆఫర్స్ తో పాటు, తెలుగులోనూ ఆయన పాగా వేయటానికి కుదురుతుంది. దాంతో ఆయన, ఇక్కడ తెలుగు లో మరో నిర్మాతతో పాటు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కు ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం.

'ఒప్పమ్‌' ఓ హత్యోదంతం నేపథ్యంలో నడిచే కథ. మోహన్‌లాల్‌ అంధుడు. ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుంటాడు. అక్కడ ఓ హత్య జరుగుతుంది. హంతకుడ్ని అంధుడైన కథానాయకుడు ఎలా పట్టుకొన్నాడు? న్యాయస్థానానికి ఎలా అప్పగించాడు? అనేదే కథ. ఈ చిత్రంలో మోహన్ లాల్.. జయరామన్ అనే పాత్రలో అంధుడిగా కనిపించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కి విజయవంతమైన ఈ చిత్రం తెలుగువారికీ నచ్చుతుందని భావిస్తున్నారు.

English summary
Oppam is the latest 2016 Indian Malayalam crime thriller film scripted and directed by Priyadarshan, based on a story by Govind Vijayan. Oppam is receiving superb responses from the audiences and at the box office This Film got Nice Reviews From Film Critics. Now the movie makers are planning to dubbing the movie remake in Telugu with Nagarjuna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu