For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అన్నయ్య బర్త్ డే వేడుకకు అందుకే రాలేదు.. అసంతృప్తిగా ఉంది.. నాగబాబు షాకింగ్ కామెంట్స్

  |
  Naga Babu Special Birthday Wishes To Megastar Chiranjeevi

  అంచెలంచెలుగా ఎదుగుతూ అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న చిరంజీవి మెగాస్టార్‌గా తెలుగు సినీ పరిశ్రమలో రారాజుగా వెలిగిపోతున్నారు. అందుకే ప్రతీ ఏడాది చిరంజీవి పుట్టిన రోజును పండుగలా చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు (ఆగస్టు 22 - 2019) మెగాస్టార్ తన 64 వ పుట్టిన రోజు జరుపుకున్నారు చిరు. ఈ సందర్బంగా భారీ వేడుక ఏర్పాటు చేయగా దానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు కానీ నాగబాబు ఎక్కడా కనిపించలేదు. దీంతో నాగబాబు విషయమై చర్చలు ముదిరాయి. ఈ తరుణంలో ఓ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చారు నాగబాబు. ఆ వివరాలు చూద్దామా..

  మై ఛానల్ నా ఇష్టం

  మై ఛానల్ నా ఇష్టం

  ఎన్నికలకు ముందే 'మై ఛానల్ నా ఇష్టం' పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు నాగబాబు. దీని ద్వారానే ప్రత్యర్థులపై విరుచుకు పడిన ఈయన.. జనసేన ఓటమిపై కూడా ఇదే ఛానెల్ స్పందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా కాలంగా ఈ యూ ట్యూబ్ ఛానెల్‌కి దూరంగా ఉన్న నాగబాబు.. మరోసారి చిరంజీవి పుట్టిన రోజు గురించి మాట్లాడుతూ వీడియోతో దర్శనమిచ్చారు.

  చాలా రోజుల తర్వాత ఇలా

  చాలా రోజుల తర్వాత ఇలా

  ఈ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలా మీ ముందుకొస్తున్నా. అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోతో పలకరిస్తున్నా. చిన్నప్పటి నుంచి మా అందరి బర్త్‌డేల కన్నా అన్నయ్య బర్త్‌డే చాలా గ్రాండ్‌గా జరుగుతూ వస్తోంది. సినిమా ఇండస్ట్రీకి రాక ముందు నుంచే అన్నయ్య పుట్టినరోజును మా అమ్మ బాగా నిర్వహించేది. అన్నయ్య సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన బర్త్‌డే రోజును మెగాఫ్యాన్స్‌ డేగా పరిగణిస్తూ వస్తున్నాం అన్నారు.

  అందుకే బర్త్ డే వేడుకకు రాలేదు

  అందుకే బర్త్ డే వేడుకకు రాలేదు

  చిరు బర్త్ డే రోజు తాను రాకపోవడానికి కారణం.. ఫారెన్‌ లో ఉండటమే అని చెప్పారు నాగబాబు. ''అన్నయ్య బర్త్ డే అంటే మా అందరికీ పండుగ రోజు. మా ఫ్యామిలీలో మేమంతా నాన్నగారి తర్వాత అంతగా గౌరవించేది అన్నయ్యనే. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. అన్నయ్య వల్లే మేమంతా కలిసి ఉంటున్నాం. బాధ్యతలు ఎలా తీసుకోవాలో మాకు నేర్పారు'' అని నాగబాబు అన్నారు.

  అంతా ఆయన బాటలోనే

  అంతా ఆయన బాటలోనే

  అన్నయ్య బాటలోనే మా ఫ్యామిలీ అంతా కొనసాగుతోంది. మెగా కుటుంబం నుంచి వచ్చే వాళ్లందరూ ఎంతో కష్టపడతారు. పవన్ కళ్యాణ్ నుంచి మొదలుకొని వైష్ణవ్ తేజ్ వరకు. చిరంజీవి ‘హార్డ్‌వర్క్‌, డెడికేషన్‌' మెగా ఫ్యామిలీ అందరికీ స్ఫూర్తి అని చెప్పారు నాగబాబు.

  అన్నయ్య విషయంలో అసంతృప్తి

  ఇక అన్నయ్య విషయంలో ఇప్పటికీ తనకు ఓ అసంతృప్తి ఉందని అన్నారు నాగబాబు. అన్నయ్యలాంటి స్టార్‌కి ఒక్కసారి కూడా ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు రాలేదేనని బాధగా ఉందని అన్నారు. అప్పట్లో ‘రుద్రవీణ'కు రావాల్సింది. కానీ, ఇవ్వలేదు. ఈసారి ‘సైరా నరసింహారెడ్డి' సినిమాతో ఆ కోరిక తీరుతుందని ఆశగా ఉందని పేర్కొన్నారు నాగబాబు. ఎన్ని జన్మలైనా ఆయనకు తమ్ముడిగానే బుట్టలని కోరుకుంటున్నానని ఈ సందర్బంగా ఆయన చెప్పారు.

  సైరా నరసింహా రెడ్డి

  సైరా నరసింహా రెడ్డి

  1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి సైరా నరసింహా రెడ్డి మూవీ రూపొందించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీగా ‘సైరా'ను తెరకెక్కించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  English summary
  Pawan Kalyan as Chief Guest at Chiranjeevi's 64th Birthday Celebration. The ceremony take place at Shilpa Kala Vedika in Hyderabad. So many cine celebrities wished chiranjeevi birthday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X