»   » నగేష్‌ కుక్నూర్‌ తాజా చిత్రం డిటేల్స్

నగేష్‌ కుక్నూర్‌ తాజా చిత్రం డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సామాజిక అంశాలే ఇతివృత్తంగా 'హైదరాబాద్‌ బ్లూస్‌', 'బాలీవుడ్‌ కాలింగ్‌', 'ఇక్బాల్‌', 'డోర్‌', 'మోడ్‌' వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్సకుడు నగేష్‌ కుక్నూర్. ఆయన తాజా చిత్రం 'లక్ష్మి' . ఈ చిత్రం చిన్న పిల్లల వ్యభిచారం ఇతివృత్తంగా తెరకెక్కించారు. గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని, పేదిరకాన్ని అడ్డం పెట్టుకుని అక్కడి ఆడపిల్లలను ఎత్తుకు వచ్చి పట్టణాల్లో వారితో ఏ విధంగా వ్యభిచారం చేయిస్తున్నారో కళ్లకు కట్టినట్లు చూపిస్తుందీ చిత్రం.

దర్శకుడు ఎంచుకున్న సామాజిక ఇతివృత్తం, సంకోచం లేకుండా తెరకెక్కించిన తీరువల్ల ఈ చిత్రం విడుదల తేదీ పలు మార్లు వాయిదా పడింది. కానీ జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సావాల్లో ప్రశంసలతో పాటు పురస్కారాలను సొంతం చేసుకుని ఇటీవలే విడుదలయింది.

Nagesh Kukunoor

మోనాలీ టాకూర్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ లక్ష్మి చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు దీనిలో ఒక కీలక పాత్ర పోషించాడు నగేష్‌ కుక్నూర్‌. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన 14 సంవత్సరాల బంగారు లక్ష్మిని తాగుబోతు తండ్రి అమ్మేస్తే ఆమె ఏ విధంగా వ్యభిచార కూపంలో ఇరుక్కుని అక్కడి నుంచి తప్పించుకోడానికి ఏ దారీ లేక చివరకు అదే తన జీవితమని సరిపెట్టుకుంటుంది. కానీ ఒక స్వచ్ఛంద సంస్ధ సహాయంతో తమ జీవితాలను ప్రపంచానికి వెల్లడించి ధైర్యే....సాహసే...'లక్ష్మి' అంటూ కథానాయకి ప్రస్థానం ఎలా ముగిసిందో సినిమా హాల్లోనే చూడాలి.

నటుడు, దర్శకుడు నగేష్‌ కుక్నూర్‌ హైదరాబాదుకు చెందిన వాడు కావడం చెప్పుకోదగ్గ విషయం. ప్రేమ సన్నివేశాలు, హీరో చేసే వీరోచిత పోరాటాలు, మరికొన్ని హాస్య సంఘటనలు, ఒక ప్రత్యేక గీతంతో ప్రేక్షకులను అలరించేలా ఉంటాయి ఆ చిత్రాలు. కానీ సమాజంలో జరుగుతున్న దోపిడీనీ, దానికి గురవుతున్న వారి వేదనలతో చిత్రం రూపు సంతరించుకుంటే లక్ష్మి వలే ఉంటుంది.

English summary
Nagesh Kukunoor's Lakshmi, which stars singer Monali Thakur, has hit the screens. While 5,00,000 girls have been child trafficked in the last five years, only Lakshmi stood up and fought back. This is the story of a 14-year-old girl who was sold into the flesh trade.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu