twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకిచ్చే 'డమరుకం' గ్రాఫిక్స్ ఖర్చు,నిడివి ఎంతంటే...

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' . విడుదల వాయిదా పడిన ఈ చిత్రంలో సిజీ విలన్ తో పోరాటమే హైలెట్ గా ఉంటుంది అంటున్నారు. ఈ చిత్రంలో కేవలం గ్రాఫిక్స్ కోసమే ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. రెండు గంటల ఇరవై ఐదు నిముషాలు నిడివి ఉన్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ డబ్బై నిముషాలు ఉంటాయి. అలాగే క్లైమాక్స్ లో వచ్చే 18 అడుగుల అంధకాసురుడు అనే పాత్రతో ఫైట్ సినిమాకి హైలెట్ అవుతుందంటున్నారు. 18 నెలలు పాటు 150 మంది కేవలం ఈ గ్రాఫిక్స్ కోసమే పనిచేసినట్లు దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెప్తున్నారు.

    'ఢమరుకం'కథ ఏమిటంటే...తెలుగు పురాణేతిహాసాల ఆధారంగా తయారుచేసుకున్న కథాంశమిది. రాక్షససంహారం జరిగిన తర్వాత శత్రుశేషంగా అంధకాసురుడు అనే రాక్షసుడు ఒక్కడే మిగిలిపోతాడు. వెయ్యి సంవత్సరాలకొక్కసారి గ్రహాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి విశ్వంలో ఓ మహాద్భుతఘట్టం సాక్షాత్కరించే సమయంలో అంధకాసురుడు తిరిగి జన్మిస్తాడు. ఆ పవిత్ర ఘడియల్లో పుట్టడం వల్ల పంచభూతాలు అతని ఆధీనంలోకి వస్తాయి. అతన్ని శివుడి అంశతో జన్మించిన ఓ యువకుడు నిలువరించి లోకకల్యాణం ఎలా చేశాడు. గ్రహాలన్నీ ఒక్కటైనా ఆ పవిత్ర ముహూర్తంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నది హీరో ఆశయం. ఎలా వివాహం చేసుకున్నాడు అనేది సినిమా కథ. ఈ చిత్రంలో అంధకాసురుడి పాత్రను రవిశంకర్ పోషించారు. మానవరూపంలో వున్న శివుడిగా ప్రకాష్‌రాజ్ కనిపిస్తారు.

    నాగార్జున పాత్ర పేరు మల్లికార్జున. అందరూ మల్లి అని పిలుస్తుంటారు. 'హలో బ్రదర్'లోని మాస్ కేరెక్టర్‌లా ఫుల్ జోష్‌తో ఉంటుంది. డబ్బు కోసం ఏమైనా చేసే పాత్ర. అనుష్క పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక 'బొమ్మాళి' రవి చేసిన పాత్ర అయితే ఎక్స్‌లెంట్. తన హావభావాలు, డైలాగ్ డిక్షన్ చూస్తే 'మాయాబజార్'లో ఎస్వీఆర్‌గారు గుర్తుకొస్తారు. నాగార్జున మాట్లాడుతూ..''నాకు వ్యక్తిగతంగా పౌరాణికాలు, సోషియో ఫాంటసీలు, అవతార్ లాంటి సినిమాలు చూడడమంటే ఇష్టం. అందుకే 'డమరుకం' చాలా ఇష్టపడి చేశా. ఈ సినిమాని వెండితెరపై చూస్తుంటే చాలా వండర్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకులకు ఇది ఓ కన్నుల పండుగే'' అని నాగార్జున చెప్పారు. డమరుకంలో చాలా విశేషాలు ఉన్నాయని, నిర్మాణ విలువలు కూడా ఓ హైలైట్ అని నాగార్జున ప్రత్యేకంగా పేర్కొన్నారు.

    శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీమేకర్స్ వెంకట్ నిర్మించిన 'డమరుకం' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, జీవా, ప్రగతి, కవిత, రజిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, సమర్పణ: కె.అచ్చిరెడ్డి.

    English summary
    
 Director Srinivas Reddy spent a whopping 8 crore for 70 minutes of computer graphics work in his 225-minute Damarukam, that’ll release in both Tamil and Hindi. There’s even a scene of Nagarjuna fighting with an 18-foot tall ‘asura’, as he saves the planet from catastrophe, along with his love interest, Anushka.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X