»   »  మళ్లీ మహేష్ బాబు డుమ్మా.... సీరియస్‌ అయిన కోర్టు!

మళ్లీ మహేష్ బాబు డుమ్మా.... సీరియస్‌ అయిన కోర్టు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'శ్రీమంతుడు' సినిమా కాపీరైట్ వివాదానికి సంబంధించి కోర్టు విచారణకు హాజరు కావాల్సిందే అంటూ మహేష్ బాబుకు నాంపల్లి కోర్టు గతం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు హాజరు కాకుండా వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కొన్ని రోజులుగా ఆయన కోర్టుకు విన్నవిస్తూ వచ్చారు.

తాజాగా మంగళవారం మరోసారి కేసు విచారణకు రాగా.... మహేష్ బాబుతో పాటు దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నవీన్ ఎర్నేని హాజరు కాలేదు. దీంతో కోర్టు సీరియస్ అయింది. మహేష్ బాబుతో పాటు దర్శక నిర్మాతలకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

తదుపరి విచారణ ఆగస్టు 7

తదుపరి విచారణ ఆగస్టు 7

హై కోర్టు నుండి గిరిధర్ పేరుతో మహేష్ బాబుకు మినహాయింపు తీసుకురావడం చెల్లదని స్పష్టం చేస్తూ కోర్టు ముందు హాజరు కావాల్సిందే అని మరోసారి సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 7కు వాయిదా వేసింది.

చచ్చేంత ప్రేమ

చచ్చేంత ప్రేమ

'శ్రీమంతుడు' చిత్రం తన నవలను బేస్ చేసుకుని తీశారని శరత్ చంద్ర అనే రచయిత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2012లో స్వాతి మాసపత్రికలో తాను 'చచ్చేంత ప్రేమ' అనే నవలను రాశాననీ, దానిని కాపీచేసి శ్రీమంతుడు సినిమాగా మలిచారని ఆరోపిస్తూ, హైదరాబాద్‌కు చెందిన రచయిత ఆర్‌.డి.విల్సన్‌ అలియాస్‌ శరత్‌చంద్ర నాంపల్లి క్రిమినల్‌ కోర్టును ఆశ్రయించారు.

ఆ సినిమా తీసే లోపే

ఆ సినిమా తీసే లోపే

తానే రాసిన చచ్చేంత ప్రేమ నవలను వెంకట్రావ్ అనే నిర్మాత తన నుంచి కొనుక్కొన్నాడని, నారా రోహిత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో నిర్మాత వెంకట్రావ్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకొంటున్న తరుణంలో 'శ్రీమంతుడు' రిలీజ్ అవ్వడం.. సూపర్ హిట్ అవ్వడం కూడా జరిగిపోయాయని శరత చంద్ర తెలిపారు.

నాలాంటి మరో రచయితకు అన్యాయం జరుగకూడదనే

నాలాంటి మరో రచయితకు అన్యాయం జరుగకూడదనే

ఈ విషయమై గత కొన్ని నెలలుగా తమిళంతోపాటు తెలుగు రచయిత సంఘాల్లోనూ ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదు, కొంతమంది ఇండస్ట్రీ పెద్దలను సైతం కలిశాము. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. డబ్బులు ఆశించి మేమీ ఫిర్యాదు చేయడం లేదు. నాలాంటి మరో రచయితకు భవిష్యత్ తో ఇటువంటి అన్యాయం జరగకూడదన్న ఆలోచనతోనే మాకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నామని రచయిత శరత్ చంద్ర గతంలో మీడియాతో అన్నారు. .

English summary
Writer Sarath Chandra moved the court after the release of Srimanthudu movie accusing the Makers of Copy Rights violation. Recently, The court has directed Mahesh Babu, Koratala Siva and Producers to appear in the court for the next hearing. Even the argument of Mahesh's Counsel citing he needn't attend the hearing wasn't entertained as Superstar is the Co-Producer of the movie. Summons have been issued asking all of them to be present in the court. Still, Mahesh Babu & Srimanthudu Team had given a miss to the hearing. Judge reacted seriously as none of them were present in the court.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu