»   » చేతులెత్తి నమస్కరిస్తూ... ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పిన మహేష్ బాబు భార్య!

చేతులెత్తి నమస్కరిస్తూ... ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పిన మహేష్ బాబు భార్య!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే. ఆయన షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లి తమ అభిమాన హీరోను కన్నులారా చూడాలని ఆశ పడుతుంటారు. ఆయన కనిపిస్తే ఈలలు వేస్తూ గోల చేస్తూ తమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు.

మహేష్ బాబు పట్ల ఇంతటి ఇష్టాన్ని చూపుతున్న ఫ్యాన్స్‌కు గురించి నమ్రత సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. చేతులెత్తి నమస్కరిస్తున్న సింబల్స్ పెట్టి.... అభిమానుల పట్ల తన మనసులోని భావాలను వ్యక్త పరిచారు.

మీలాంటి అభిమానులను కలిగి ఉండటం తమ అదృష్టమని, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము అంటూ... ఫ్యాన్స్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు షేర్ చేసి థాంక్స్ చెప్పారు. నమ్రత చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

English summary
"So much love... all for one person ... its overwhelming and humbling to see these events day after day 💞.. all with the same fire ... same intensity and the same love.. all for their hero .. this is just to say a big thankyou to all of you and all the fans for your continuous and unconditional love for." Namrata Shirodkar said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X