»   » బాలయ్య కూతురు ఆహ్వానం: నమ్రత, ఉపాసన, మంచు లక్ష్మి, సితార ఒకే చోట (ఫోటోస్)

బాలయ్య కూతురు ఆహ్వానం: నమ్రత, ఉపాసన, మంచు లక్ష్మి, సితార ఒకే చోట (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Tollywood 'Super Ladies' Get Together

టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్‌కు చెందిన సూపర్ లేడీస్ అంతా కలిసి ఒకే చోట చేరితే అభిమానులకు కన్నుల పండుగే. ఇలాంటి మూమెంట్స్ చాలా అరుదుగా చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత, రామ్ చరణ్ భార్య ఉపాసన, ప్రముఖ నటి మంచు లక్ష్మి, బాలయ్య కూతురు బ్రాహ్మణి ఒకే చోట చేరి సందడి చేశారు.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

నారా బ్రాహ్మణి ఆహ్వానం మేరకే...

నారా బ్రాహ్మణి ఆహ్వానం మేరకే...

నారా బ్రాహ్మణి ఆహ్వానం మేరకే ఈ సూపర్ స్టార్స్ ఫ్యామిలీకి చెందిన సూపర్ లేడీస్ అంతా ఒక చోట చేరారు. నారా బ్రాహ్మణి తన కుమారుడు దేవాన్ష్ 3వ పుట్టినరోజు వేడుక సెలబ్రిటీలను పిలిచి గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్బంగా నమ్రత, ఉపాసన, మంచు లక్ష్మిలను ఆహ్వానించారు.

చిట్టితల్లి సితార కూడా

చిట్టితల్లి సితార కూడా

ఈ పుట్టినరోజు వేడుకకు మహేష్ బాబు కూతురు, చిట్టితల్లి సితార కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సితార, ఉపాసన కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అందుకే వారు సూపర్ లేడీస్

అందుకే వారు సూపర్ లేడీస్

ఉపాసన, నమ్రత, మంచు లక్ష్మి, నారా బ్రాహ్మణిలను ఇండస్ట్రీలో అంతా సూపర్ లేడీస్ అంటూ ఉంటారు. ఎందుకంటే కేవలం కుటుంబ సభ్యుల సెలబ్రిటీ స్టేటస్ మీద ఆధారపడకుండా తమ టాలెంట్, తెలివితో సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

చాలా క్లోజ్ ఫ్రెండ్స్

చాలా క్లోజ్ ఫ్రెండ్స్

నమ్రత, ఉపాసన, మంచు లక్ష్మి, నారా బ్రాహ్మణి తదితరుల మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఏదైనా ప్రత్యేక సమయాలు, వేడుకలు లాంటివి జరిగినపుడు అంతా కలిసి ఇలా ఒక చోట చేరి సందడి చేస్తూ ఉంటారు.

English summary
Tollywood super star Mahesh Babu’s wife Namrata Shirodkar and Mega power star Ram Charan’s wife Upasana, Lakshmi Manchu attended the 3rd birthday bash of Nara Lokesh and Brahmani’s son Devansh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X